Holy 2025: హోలీ రోజున ఆ ఊరులో వింత ఆచారం.. కొత్త అల్లుడుతో ఏమి చేస్తారంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
ఫాల్గుణ మాసంలోని పౌర్ణమి రోజున (మార్చి 14) హోలీ పండుగ జరుపుకుంటారు.
ఈ ఏడాది హోలీ పండుగను మార్చి 14న దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు.
శ్రీకృష్ణుడు జన్మించిన మధురా,నడయాడిన బృందావనంలోని హోలీ వేడుకలు విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి.
అయితే భారతదేశంలోని ఓ గ్రామంలో హోలీ పండుగను ఎంతో ప్రత్యేకమైన రీతిలో నిర్వహిస్తారు.
ఇది తెలిసిన వారికి ఆశ్చర్యం కలగకమానదు. హోలీని విభిన్నంగా జరుపుకునే ఈ గ్రామ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వివరాలు
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు
దేశవ్యాప్తంగా ప్రజలు హోలీ సంబరాలకు సిద్ధమవుతున్నారు. మార్చి 14న రంగుల కొనుగోలుకు రెడీ అవుతున్నారు.
ఇప్పటికే చాలా మంది హోలీ పండుగను జరుపుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు.
చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.
అయితే భారతదేశంలోని ప్రాంతాలను బట్టి హోలీ వేడుకల్లో ప్రత్యేకత కనిపిస్తుంది.
వివరాలు
మహారాష్ట్ర విడా గ్రామ హోలీ ప్రత్యేకత
మహారాష్ట్రలోని బీడ్ జిల్లా విడా గ్రామంలో హోలీ పండుగను ఎంతో విశేషంగా జరుపుకుంటారు.
ఈ గ్రామంలో హోలీ రోజు ఒక ప్రత్యేకమైన ఆచారాన్ని పాటిస్తారు. కొత్తగా పెళ్లయిన అల్లుడిని గాడిదపై ఊరేగించే ఆనవాయితీ ఇక్కడ ఉంది.
ఈ సంప్రదాయం గత 86 సంవత్సరాలుగా కొనసాగుతోంది.
హోలీ రోజున ప్రత్యేక వేడుకలు
హోలీ పండుగనాడు కొత్త అల్లుడిని ఇంటికి ఆహ్వానిస్తారు. అనంతరం గాడిదపై కూర్చోబెట్టి, రంగులతో అలంకరించి ఊరేగింపుగా గ్రామమంతా తిప్పుతారు.
గ్రామ ప్రజలు కొత్త అల్లుడికి రకరకాల బహుమతులను అందిస్తారు.
విడా గ్రామంలో జరిగే ఈ ప్రత్యేకమైన హోలీ వేడుకను చూడటానికి దూర ప్రాంతాల నుంచీ కూడా పెద్ద సంఖ్యలో జనాలు వస్తారు.
వివరాలు
ఈ వింత ఆచారం వెనుక కథ
స్థానిక ప్రజల అభిప్రాయం ప్రకారం, సుమారు 86 సంవత్సరాల క్రితం బీడ్ జిల్లాలోని విడా గ్రామంలో దేశ్‌ముఖ్ కుటుంబం నివసించేది.
హోలీ పండుగ సందర్భంగా దేశ్‌ముఖ్ కుటుంబపు కుమార్తె తన భర్తతో పాటు ఇంటికి వచ్చింది.
అయితే అల్లుడు రంగులు పూసుకుని హోలీ ఆడటానికి నిరాకరించాడు. దీని తరువాత మామగారు అల్లుడిని ఒప్పించేందుకు పలు ప్రయత్నాలు చేశారు.
అంగీకరించిన అనంతరం, పూలతో అలంకరించిన గాడిదను తెచ్చి, అల్లుడిని దానిపై కూర్చోబెట్టి గ్రామమంతా ఊరేగించారు.
వివరాలు
సంప్రదాయంగా మారిన ఆచారం
ఈ వినూత్న సంప్రదాయాన్ని ఆనందరావు దేశ్‌ముఖ్ అనే వ్యక్తి ప్రారంభించాడని నమ్ముతారు.
అతనికి గ్రామంలో గౌరవం అధికంగా ఉండేది. ఈ విధంగా ప్రారంభమైన ఈ సంప్రదాయం నేటికీ అదే విధంగా కొనసాగుతోంది.
హోలీ రోజు కొత్త అల్లుడికి గ్రామస్తులు బహుమతులు, కొత్త వస్త్రాలు అందజేస్తారు.
ఉల్లాసంగా జరిగే హోలీ సంబరాలు
విడా గ్రామంలోని ఈ ప్రత్యేకమైన హోలీ వేడుకలు ప్రతి ఏడాది భక్తి, ఆనందం, ఉత్సాహంతో నిర్వహిస్తారు.
పెద్దల ఆశీస్సులు, గ్రామస్తుల ప్రేమతో కొత్త అల్లుడు ప్రత్యేక గౌరవాన్ని పొందుతాడు. దేశ వ్యాప్తంగా జరిగే హోలీ వేడుకల్లో విడా గ్రామ హోలీ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.