Dondakaya Nilva Pachadi: గ్రైండింగ్ అవసరం లేదు.. పక్కా కొలతలతో దొండకాయ పచ్చడి తయారీ!
ఈ వార్తాకథనం ఏంటి
సాధారణంగా దొండకాయతో కర్రీలు, వేపుళ్లు చేస్తుంటారు. అయితే ఇవే కాకుండా రుచిలో అదిరిపోయే మరో ప్రత్యేకమైన రెసిపీ కూడా ఉంది. అదే 'దొండకాయ నిల్వ పచ్చడి'. ఈ విధానంలో తయారు చేస్తే పచ్చడి పుల్లపుల్లగా, కారం కారంగా ఎంతో రుచిగా ఉంటుంది. ముఖ్యంగా తక్కువ పదార్థాలతో, అప్పటికప్పుడు సులభంగా చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా ఈ స్టెప్స్ ఫాలో అవుతూ నిమిషాల్లోనే ఈ పచ్చడిని సిద్ధం చేసుకోవచ్చు.వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి ఈ పచ్చడిని తింటే రుచి అదిరిపోతుంది. ఈ పచ్చడి ప్రత్యేకత ఏమిటంటే... రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది. మరి ఆలస్యం ఎందుకు? ఈ రుచికరమైన దొండకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో, కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Details
కావాల్సిన పదార్థాలు
దొండకాయలు - అర కిలో (500 గ్రాములు)
కారం - పావు కప్పు
ఆవపిండి - పావు కప్పు
పసుపు - ఒక స్పూన్
ఉప్పు - పావు కప్పు
మెంతిపిండి - 1 టీ స్పూన్
నిమ్మరసం - 3 టేబుల్ స్పూన్లు
ఆయిల్ - అర కప్పు
ఎండుమిర్చి - 4
తాలింపు దినుసులు - 1 టేబుల్ స్పూన్
ఇంగువ - 2 చిటికెడ్లు
Details
తయారీ విధానం
ముందుగా అర కిలో దొండకాయలను శుభ్రంగా కడిగి, క్లాత్‌తో తుడిచి పూర్తిగా ఆరబెట్టాలి.అనంతరం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో కట్ చేసిన దొండకాయ ముక్కలు వేసి, ఒక స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ మెంతిపిండి జోడించాలి.
పావు కప్పు ఆవపిండి, పావు కప్పు ఉప్పు, పావు కప్పు కారం, మూడు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలపాలి.
తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలో అర కప్పు ఆయిల్ వేయాలి.నూనె వేడైన తర్వాత నాలుగు ఎండుమిర్చులు, ఒక టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు వేసి వేయించాలి.
ఇందులో రెండు చిటికెడ్ల ఇంగువ వేసి కలిపి, స్టవ్ ఆఫ్ చేసి తాలింపును పూర్తిగా చల్లారనివ్వాలి.
Details
తయారీ విధానం1/2
చల్లారిన తాలింపును దొండకాయ మిశ్రమంలో వేసి బాగా కలపాలి.
అనంతరం ఈ పచ్చడిని ఎయిర్‌టైట్ జార్‌లోకి తీసుకుని, రెండు రోజుల పాటు అలాగే ఉంచాలి.
అంతే... రుచికరమైన దొండకాయ నిల్వ పచ్చడి సిద్ధం.
ఈ విధంగా తయారు చేస్తే ఈ పచ్చడి
రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది.
వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి ఈ పచ్చడిని తింటే, ఇప్పటివరకు తినని కొత్త రుచిని ఆస్వాదిస్తారు.
ఈ పచ్చడిని ఎక్కువ మోతాదులో తయారు చేయాలనుకుంటే, దొండకాయతో పాటు మిగతా పదార్థాల పరిమాణాన్ని కూడా అదే నిష్పత్తిలో పెంచుకోవాలి.