
motivation: ఎంత కష్టపడినా ఫలితం కనిపించడంలేదా? చాణక్య చెప్పిన ఐదు మార్గాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
ఆచార్య చాణక్యుడు కేవలం ప్రఖ్యాత ఆర్థికవేత్త, రాజకీయ నిపుణుడు మాత్రమే కాదు గొప్ప తాత్వికుడూ, రచయిత కూడా. జీవితాన్ని విజయం వైపు నడిపించే అనేక మూల సూత్రాలను ఆయన 'చాణక్య నీతి' పేరుతో రూపొందించారు. సత్యాలు, అనుభవాలు కలగలసిన ఈ పుస్తకంలో విజయం సాధించాలంటే ఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలో చాణక్య స్పష్టంగా పేర్కొన్నాడు. సమయం ఎంత ముఖ్యమో గుర్తించండి చాణక్యుని ప్రకారం, మనం చెప్పే ప్రతి మాటకూ సరైన సమయం ఉండాలి. ఎంత మంచి విషయమైనా సరే, దానిని సరైన సమయానికి చెప్పకపోతే అది చేటుగా మారే అవకాశమే ఎక్కువ. అందుకే, అనుకోను విషయాన్ని ఇతరులకు చెప్పే ముందు - అది చెప్పే సమయం సరైందో లేదో పరిశీలించాల్సిందే.
Details
ఈ నాలుగు విషయాలను ఎవరికీ చెప్పొద్దు
చాణక్యుని ప్రకారం, మీ జీవితంలోని కొన్ని విషయాలను ఎవరికీ చెప్పకూడదు 1. మీ వ్యక్తిగత ప్రణాళికలు, లక్ష్యాలు. 2. మీ బలహీనతలు. 3. మీ వద్ద ఉన్న డబ్బు స్థితి. 4. మీ సమస్యలు. ఈ విషయాలు గోప్యంగా ఉంచగలిగినవారికి జీవితంలో భద్రతా భావం, విజయవంతమైన మార్గం లభిస్తుంది.
Details
మనస్సుపై నియంత్రణ - శక్తివంతమైన ఆయుధం
కోపం, అసూయ, ద్వేషం వంటి భావాలు మనకు లోపాల్లా కనిపించినా, ఇవే మన జీవితాన్ని నాశనం చేసే శక్తులు అని చాణక్య హెచ్చరిస్తాడు. అలాంటి భావాలను నియంత్రించగలిగినవాడు మాత్రమే అసలైన విజయవంతుడు అవుతాడు. దిశగా అడుగులు వేయాలి. జ్ఞానం - అసలైన సంపద డబ్బు, ఆస్తులు, భౌతిక వస్తువులు నశించిపోవచ్చు. కానీ జ్ఞానం మాత్రం జీవితాంతం మనతో ఉంటుంది. ప్రతిరోజూ ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవడం, విజయం సాధించాలనుకునే ప్రతి ఒక్కరి ధర్మం. జ్ఞానం పెరిగే కొద్దీ, జీవితం మెరుగుపడుతుంది.
Details
చుట్టుపక్కల వాతావరణం - విజయం లేదా వినాశనం?
తప్పు వ్యక్తులు, తప్పుడు వాతావరణం జీవితాన్ని గందరగోళంలోకి నెట్టేస్తాయని చాణక్య చెబుతున్నాడు. ఎవరైనా సానుకూలంగా ప్రభావం చూపే వ్యక్తులతోనే ఉండాలి. అప్పుడు మాత్రమే మన జీవితం సరైన దిశలో ప్రయాణిస్తుంది. స్థిరత్వం, మంచి పరిచయాలే వ్యక్తిత్వ నిర్మాణానికి మూలాధారం.