Page Loader
Motivation: శత్రువు ఎంత బలవంతుడైనా ఓడిపోవాల్సిందే.. ఈ మార్గాలను పాటిస్తే చాలు! 
శత్రువు ఎంత బలవంతుడైనా ఓడిపోవాల్సిందే.. ఈ మార్గాలను పాటిస్తే చాలు!

Motivation: శత్రువు ఎంత బలవంతుడైనా ఓడిపోవాల్సిందే.. ఈ మార్గాలను పాటిస్తే చాలు! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 14, 2025
02:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి - కొన్నిసార్లు మన శత్రువుల వల్ల కూడా ఉంటాయి. అయితే శత్రువులపై విజయాన్ని సాధించాలంటే శక్తిమంతమైన ఆయుధాలు అవసరం కాదు. ఆచార్య చాణక్య రచించిన చాణక్య నీతి శాస్త్రం మనకు శత్రువులను ఎదుర్కొనే మేధోబలాన్ని అందిస్తుంది. గొప్ప దౌత్యవేత్త, రాజకీయ, ఆర్థిక శాస్త్రవేత్త అయిన చాణక్యుడు శత్రువులను జయించేందుకు అనుసరించవలసిన మార్గాలను స్పష్టంగా పేర్కొన్నారు. ఈ మార్గాలు ఆచరణలో పెట్టడం ఎంత సులభమో, ఫలితాలూ అంతగానే విశేషంగా ఉంటాయి.

Details

1. సంతోషంగా ఉండటం - శత్రువుని కలవరపెట్టే శక్తి

చాణక్యుడు చెప్పిన ప్రకారం, శత్రువు ఎంత బలమైనవాడైనా, మీరు సంతోషంగా ఉండడాన్ని సహించలేడు. మీ అభ్యంతరాలను, బాధలను మీ హృదయంలో ఉంచుకుని బయటికి మాత్రం ఉల్లాసంగా కనిపించడం శత్రువుకు మానసికంగా గట్టి ఎదురుదెబ్బ. మీరు బాధలో ఉన్నా, మీ ముఖంలో చిరునవ్వు ఉండేలా చూసుకోండి. ఇది శత్రువు బలాన్ని గణనీయంగా తక్కువ చేస్తుంది. మీరు సంతోషంగా ఉండడమే అతని స్థైర్యాన్ని దెబ్బతీయడమే కాదు, అతన్ని అయోమయంలోకి నెట్టి తడబడేలా చేస్తుంది.

Details

2. ప్రత్యుత్తరాలు వద్దు - మౌనం కూడా ఓ వ్యూహమే 

ఎవరైనా శత్రువు మాటలతో రెచ్చగొట్టినప్పుడు వెంటనే స్పందించకండి. చాణక్యుని మాటల్లో, తక్షణ స్పందన ద్వారా శత్రువుకు మన బలహీనతలు బహిర్గతమవుతాయి. మౌనం ఎన్నిసార్లు మనం ఊహించనంత శక్తివంతంగా పనిచేస్తుంది. మీరు ఏ సమాధానం చెప్పకపోతే, శత్రువు అనుమానంలో పడతాడు. ప్రతిసారీ మాటలతో ప్రతిస్పందించకుండానే, చర్యలతో సమాధానం చెప్పడం శక్తివంతమైన వ్యూహం. మౌనం బలహీనత కాదు - అది సంయమనాన్ని సూచించే బలమైన సంకేతం.

Details

3. కోపాన్ని నియంత్రించండి - విజయంలో కీలక పాత్ర

కోపం అనేది శత్రువు మనల్ని ఎదురులేని స్థితిలోకి నెట్టే సాధనం. కానీ మనం కోపాన్ని నియంత్రించగలిగితే, శత్రువుకు ఎదురుగా ఒక అసాధ్యమైన గోడగా మారతాం. కోపంలో తీసుకున్న నిర్ణయాలు మనకే నష్టాన్ని కలిగిస్తాయి. చాణక్యుని ప్రకారం, కోపం నియంత్రణ విజయానికి మార్గం. ప్రశాంతంగా ఆలోచించి వ్యూహపూరితంగా ముందడుగు వేస్తే, శత్రువుని ఎదుర్కోవడం కాకుండా శత్రువే వెనక్కి తగ్గాల్సి వస్తుంది. శత్రువు ఉన్నాడంటే మీరు ఎదుగుతున్నారన్న సాక్ష్యమే. కానీ అతనిపై విజయం సాధించాలంటే బలప్రదర్శనకంటే మేధస్సు, సంయమనం, అంతర్గత ఆత్మబలం అవసరం. చాణక్యుని నీతి మనకు ఈ మార్గాలు చూపిస్తుంది. మీరు సంతోషంగా ఉండటం, మౌనంగా స్పందించడం, కోపాన్ని కంట్రోల్ చేయడం - ఇవే మూడు శక్తివంతమైన ఆయుధాలు.