
హీరోలు, హీరోయిన్లపై పిచ్చి ప్రేమ చూపిస్తున్నారా? మీ ఆరోగ్యం జాగ్రత్త
ఈ వార్తాకథనం ఏంటి
సెలెబ్రిటీలుగా ఎదిగిన వారికి ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఫాలోవర్లలో మీరు కూడా ఒకరైతే పెద్దగా సమస్యేమీ లేదు, కానీ సెలెబ్రిటిలని ఫాలో అవుతూ, వాళ్ళని అతిగా ఆరాధిస్తేనే సమస్య ఎదురవుతుంది.
సినిమా తారలను గానీ, రాజకీయ నాయకులను గానీ, ఏ రంగంలోని సెలెబ్రిటీనైనా అతిగా ఆరాధిస్తుంటే మీరు సెలెబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ జబ్బుతో బాధపడుతున్నారని అర్థం.
బాలీవుడ్ సినిమా ఫ్యాన్ లో ఈ సెలెబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ గురించి కనిపిస్తుంది. అలాగే గుడ్డి అనే మరో బాలీవుడ్ మూవీలోనూ ఇది ఉంటుంది.
CWSతో బాధపడేవారు సెలెబ్రిటీ గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. సెలెబ్రిటీ రిలేషన్ షిప్స్ గురించీ, ఏం చేస్తున్నారనే దాని గురించి అనుక్షణం ఆలోచిస్తారు. సెలెబ్రిటీకి సంబంధించిన వస్తువులు కొనడానికి ఇష్టపడతారు.
మానసిక ఆరోగ్యం
వ్యక్తిగత జీవితం మీద ప్రభావం చూపే సెలెబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్
అభిమానం ఎక్కువైతే, సెలెబ్రిటీతో మాట్లాడడానికి, అనుక్షణం వారిచుట్టూ ఉండడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల తమ బంధాల్లో సమస్యలు వస్తాయి. తమ పార్ట్ నర్ లో సెలెబ్రిటీకి సంబంధించిన లక్షణాలను వెతుకుతారు.
సొంత విషయాల మీద పెద్దగా ఆసక్తి ఉండదు. సెలెబ్రిటీ గురించి ఎలాంటి ప్రచారం వచ్చినా రియాక్ట్ అవుతుంటారు. అవి కొన్నికొన్ని సార్లు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి తమ కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తాయి.
ఇక్కడ కాయిన్ కి మరోవైపుండే విషయమేంటంటే, సెలెబ్రిటీ జీవితంలోని మంచి అలవాట్లు కూడా కొందరు నేర్చుకుంటారు. CWS ని తగ్గించడానికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అందుకే ఏదైనా అతిగా చేస్తే అనర్థమే అని గుర్తుంచుకోవాలి.