అవయన దానం గురించి జనాలు నమ్మే ఈ నమ్మకాలను ఇప్పుడే వదిలిపెట్టండి
అవయవ దానం అనేది అత్యంత పవిత్రమైనది. ఒక మనిషిని బ్రతికించడానికి అవయవాలను దానం చేయడమనేది అన్నింటికంటే చాలా ఎక్కువ. ఐతే ఈ అవయవ దానం చుట్టూ అనేక అనుమాలు సాధారణ జనాల్లో ఉన్నాయి. ఆ అనుమానాలే అర్థం లేని నమ్మకాలుగా స్థిరపడ్డాయి. ఆ నమ్మకాలేంటో తెలుసుకుని వాటి వెనక దాగిన నిజాలను వెలికి తీద్దాం. అపనమ్మకం: అవయవదానం ఎవ్వరైనా చేయవచ్చు ఇది నిజం కాదు. దానమిచ్చే వ్యక్తి ఆరోగ్యాన్ని బట్టి అవయవదానం ఉంటుంది. అంతేకానీ అందరూ చేయవచ్చని వందశాతం చెప్పలేము. అపనమ్మకం: అవయవదానం వల్ల అంగవైకల్యం వస్తుంది అవయవాలను శరీరం నుండి తీసేటపుడు అత్యంత జాగ్రత్తగా సర్జరీ చేసి బయటకు తీస్తారు. కాబట్టి అంగవైకల్యం సమస్య ఉండదు.
అవయవ దానం చుట్టూ ఉన్న అపనమ్మకాలు
కొన్నిసార్లు ఒరిజినల్ అవయవాల స్థానంలో డూప్లికేట్ అవయవాలు పెడతారు. ఉదాహరణకు కన్ను దానం చేస్తే, ఆ స్థానంలో మరో కన్ను పెడతారు. కాబట్టి వైకల్యం అనేది ఉండదు. అపనమ్మకం: అవయవ దానం చేసిన వారికి డబ్బులు వస్తాయి ఇది నిజం కాదు. అవయవ దానం చేసిన వారికి ఎవ్వరూ డబ్బులు ఇవ్వరు. అలా ఇవ్వడం చట్టరీత్యా నేరమవుతుంది. అవయవాలు అందిపుచ్చుకున్న వారికి సర్జరీ కోసం ఖర్చు అవుతుందే తప్ప అవయవం ఇచ్చిన వారికి ఎలాంటి ఖర్చు ఉండదు. ఎలాంటి డబ్బులు రావు. అపనమ్మకం: అవయవ దానం మతానికి వ్యతిరేకం అవయవ దానం అనేది తమ మతానికి వ్యతిరేకమని చాలామంది భావిస్తుంటారు. కానీ అది నిజం కాదు. చాలా మతాలు అవయవ దానాన్ని ప్రోత్సహిస్తాయి.