ఈ దేశాల్లో మన రూపాయి వీలువ చాలా ఎక్కువ, అవేంటో తెలుసా?
విదేశీ పర్యటనలకు వెళ్లాలనుకుంటున్నారా? ఖర్చు ఎక్కువ అవుతుందని ఎక్కడికీ ప్లాన్ చేసుకోలేకపోతున్నారా? అలాంది ఆందోళన మీకు అవసర లేదు. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాల కరెన్సీ కంటే భారతయ రూపాయి బలంగా ఉంది. భారతీయ కరెన్సీ విలువ ఏ దేశాల్లో ఎక్కువగా ఉంటుందో ఓసారి పరిశీలిద్దాం. నేపాల్: నేపాల్‌కు భారతీయ కరెన్సీని కూడా తీసుకెళ్లొచ్చు. అయితే దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. చాలా తక్కువ ఖర్చుతో నేపాల్‌లో పర్యటించవచ్చు. భారతీయ రూ.1 విలువ 1.6నేపాలీ రూపాయితో సమానం. భూటాన్: భూటాన్‌లో భారతీయ కరెన్సీతో కూడా లావాదేవీలు జరపొచ్చు. ఇక్కడి ప్రకృతి అందాలను చూసేందుకు విదేశీ పర్యటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. భారతీయ రూ.1 విలువ 1 భూటాన్ న్గుల్ట్రమ్‌కి సమానం.
కాంగోతో యుద్ధం ఫలితంగా దిగజారిన జింబాబ్వే ఆర్థిక పరిస్థితి
జింబాబ్వే: కాంగోతో యుద్ధం సమయంలో జింబాబ్వేపై అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో ఆ దేశ ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించింది. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరగడంతో ధరలు ఆకాశన్నంటాయి. నివారణ చర్యల్లో భాగంగా జింబాబ్వే తన స్థానిక కరెన్సీని నిలిపివేసింది. అమెరికా డాలర్, దక్షిణాఫ్రికా ర్యాండ్‌లతో మరో ఆరు దేశాల కరెన్సీని మారకం కోసం వినియోగించడం మొదలు పెట్టింది. తాజాగా భారత కరెన్సీని కూడా ఆ జాబితాలో చేర్చింది జింబాబ్వే. ప్రస్తుతం ఆ దేశంలో ద్రవ్యోల్బణం 243.8శాతం పైనే ఉంది. దక్షిణ కొరియా: దక్షిణకొరియా ప్రకృతి అందాలకు నెలవు. ఈదేశంలో కూడా ఖర్చుకు భయపడుకుండా హాయిగా పర్యటించవచ్చు. ఇక్కడ 1 భారతీయ రూపాయి 15.26 దక్షిణ కొరియన్ వాన్లతో సమానం.