Red chilli pickle: నోరూరించే సూపర్ రోటి పచ్చడి..సులభంగా చేసుకోండిలా
ఈ వార్తాకథనం ఏంటి
పండు మిర్చితో చేసే పచ్చడి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం చాలా మంది ఈ పచ్చడిని గ్యాస్‌పై కొంత వేడి చేసి తయారు చేస్తారు. అయితే పాత కాలంలో మాత్రం రోకలి బండలో బాగా నూరి చేసేవారు. అలా చేసిన పచ్చడి వేడి వేడి అన్నంలో కలిపి తింటే కారం రుచి మరింత పెరిగి అద్భుతంగా ఉంటుంది. మరి ఆలస్యం ఎందుకు... ఈ రుచికరమైన పండు మిర్చి రోటి పచ్చడిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, విధానం గురించి తెలుసుకుందాం.
వివరాలు
కావాల్సిన పదార్థాలు
పావు కిలో పండు మిర్చి,
50 గ్రాముల వెల్లుల్లి రెబ్బలు,
తగినంత ఉప్పు,
5 స్పూన్లు నిమ్మరసం,
రెండు ఉల్లిపాయలు,
అర కట్ట కొత్తిమీర.
వివరాలు
తయారీ విధానం
ముందుగా తోటలో లేదా మార్కెట్‌లో లభించే పండు మిర్చిని తీసుకుని వాటిని శుభ్రంగా కడగాలి.
తరువాత తేమ లేకుండా పలుచని గుడ్డతో బాగా తుడవాలి.
ఆ తర్వాత ఒక ప్లేట్‌లో వేసి ఫ్యాన్ కింద కొంతసేపు ఉంచి పూర్తిగా ఆరబెట్టాలి.
మిర్చి బాగా ఆరిన తర్వాత వాటి తోడిమలను తీసేసి రెండు లేదా మూడు ముక్కలుగా కోయాలి.
ఇలా కోసిన మిర్చి ముక్కలను ఒక ప్లేట్‌లోకి తీసుకుని రోకలి బండలో వేసి కొంచెం గట్టిగా నూరాలి.
తర్వాత అందులో సుమారు పది వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు వేసి మళ్లీ బాగా నూరాలి.
మిక్సీలో గ్రైండ్ చేయడం కంటే రోకలి బండలో నూరితే పండు మిర్చి పచ్చడికి మరింత మంచి రుచి వస్తుంది.
వివరాలు
అన్నంలోకి అదుర్స్
పచ్చడి సిద్ధమైన తర్వాత చివరిలో మూడు స్పూన్ల నిమ్మరసం కలపాలి.
మిర్చి మంట తక్కువగా ఉండాలని అనుకుంటే అర కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు.
చివరగా కొత్తిమీరను కూడా కలిపితే పచ్చడి రుచి మరింత పెరుగుతుంది.
ఈ పచ్చడిని వేడి అన్నంతో తింటే అద్భుతమైన రుచిని ఆస్వాదించవచ్చు.
ఈ ఆహారం మీకు మంచి రుచిని అందిస్తుంది.