
మీ పిల్లలు మీరు చెప్పింది వినకుండా వాదిస్తున్నారా? ఇలా డీల్ చేయండి
ఈ వార్తాకథనం ఏంటి
పిల్లల పెంపకం అంత ఈజీ కాదు. ఏడెనిమిదేళ్ళ వయసు రాగానే పిల్లలు చెప్పింది వినరు. అడ్డంగా వాదించడం మొదలెడతారు. కొన్నిసార్లు వారి వాదనలు మీకు విచిత్రంగా అనిపిస్తాయి.
అలా వాదించడం తప్పు కాదని ముందుగా తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ప్రస్తుతం ఇలా వాదించే పిల్లలను ఎలా డీల్ చేయాలో తెలుసుకుందాం.
వాదన వల్ల కొత్త పరిష్కారాలు కనుగొనబడతాయి. మీ పిల్లలు మీరు చెప్పిన ఒక విషయాన్ని ఒప్పుకోవడం లేదంటే వారు కొత్తగా ఆలోచిస్తున్నట్లు లెక్క. దానివల్ల వారి ఊహాశక్తి పెరుగుతుంది.
పిల్లలు ఏదైనా విషయాన్ని వ్యతిరేకిస్తున్నారంటే అదెందుకో మీరు పూర్తిగా తెలుసుకోండి. వాళ్ళ మాటలు పూర్తిగా వింటేనే మీరేం చేయాలో క్లారిటీ వస్తుంది.
Details
పిల్లలకు పెద్దలే రోల్ మోడల్
తమకు నచ్చిందే చేయాలన్న కాన్సెప్ట్ లో వాదించే పిల్లలు ఎక్కువగా ఉంటారు. అలాంటప్పుడు తమకు వాళ్ళకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చి అందులోంచి నచ్చింది తీసుకోమనండి. దానివల్ల వాళ్ళలో సమస్యను పరిష్కరించే నైపుణ్యం వస్తుంది.
పిల్లలు పెరుగుతున్నప్పుడు మీరు కామ్ గా ఉండాలి. వారికి మీరే రోల్ మోడల్. మిమ్మల్ని చూసే ఎలా ఉండాలో నేర్చుకుంటారు. అందుకే ఇంట్లో వీలైనంతా కామ్ గా ఉండండి. అనవసరంగా అరిస్తే వారికి కూడా అదొక అలవాటుగా మారుతుంది.
వయసుకు తగిన హద్దులను పెట్టాలి. దానివల్ల తమకు ఏది సరైనదో ఏది కాదో అన్న విషయం అర్థమవుతుంది. సో, వాదించకుండా ఉంటారు. హద్దులను కూడా ప్రశాంతంగా కమ్యూనికేట్ చేయండి. అరిస్తే పిల్లలపై నెగెటివ్ గా ప్రభావం పడుతుంది.