Free Train: ఈ ట్రైన్‌లో ట్రావెల్ చేయడానికి ఎలాంటి టికెట్ కొనాల్సిన అవసరం లేదు.. ఫ్రీ ఫ్రీ ఫ్రీ..!
ఈ వార్తాకథనం ఏంటి
రైలు ప్రయాణం చేయాలంటే సాధారణంగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజూ లక్షల మంది ప్రయాణికులు భారతీయ రైల్వే ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.
జనరల్, ఏసీ, స్లీపర్ ట్రైన్ లో ప్రయాణించే వారు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవడం లేదా టికెట్ కౌంటర్ నుంచి టికెట్ తీసుకోవడం అవసరం.
ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు రోజూ ట్రైన్‌లో ప్రయాణిస్తుంటారు.
కానీ, ఒక ప్రత్యేక ట్రైన్ ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తుంది. ఈ ట్రైన్‌లో ప్రయాణించాలంటే ఎలాంటి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
వివరాలు
భాక్రానంగల్ డ్యామ్ మీద ప్రయాణించే రైలు
అయితే, ఈ ట్రైన్ ఎక్కడ ఉందో తెలుసుకుందాం. భారతీయ రైల్వేలు ప్రతిరోజూ లక్షల ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చుతూ, ప్రపంచంలోనే అతి పెద్ద నెట్‌వర్క్ కలిగి నాలుగో స్థానంలో నిలిచింది.
దేశంలో ఎక్కడైనా రైలు ప్రయాణం చేయాలనుకుంటే, టికెట్ తీసుకోవాల్సిందే, లేకుంటే అది చట్టబద్ధంగా నేరం.
భాక్రానంగల్ డ్యామ్ పై ప్రయాణం చేసే రైలు ప్రయాణికులు మాత్రం తమ గమ్యస్థానాలకు వెళ్లాలంటే ఎలాంటి టికెట్ తీసుకోవాల్సన అవసరం లేదు.
ఈ డ్యామ్ హిమాచల్ ప్రదేశ్ - పంజాబ్ సరిహద్దుల్లో నిర్మించబడింది. డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అందమైన దృశ్యాలను చూడటానికి ప్రతిరోజూ వందలాది మంది యాత్రికులు వస్తున్నారు.
వివరాలు
508 స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రణాళికలు
ఈ డ్యామ్‌ను సందర్శించేందుకు ప్రత్యేకంగా ట్రైన్ ఏర్పాటు చేశారు. ఇందులో ప్రయాణించాలంటే టికెట్ కొనాల్సిన అవసరం లేదు, మొత్తం 13 కిలోమీటర్ల దూరం ఉచితంగా ప్రయాణించవచ్చు.
ఈ ట్రైన్‌లో డీజిల్ ఇంజిన్ అమర్చించబడింది, బోగీలను చెక్కతో తయారుచేశారు.
ఈ ట్రైన్ సట్లెట్ నది, శివాలిక్ కొండల మీదుగా ప్రయాణిస్తుంది. ప్రతిరోజూ దాదాపు 800 మంది ఈ ట్రైన్‌లో ప్రయాణిస్తున్నారు.
ఇక్కడ ప్రకృతి అందాలను తిలకిస్తూ యాత్రికులు ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు.
తాజాగా, భారతీయ రైల్వే ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది, ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 508 స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రణాళికలు ప్రకటించారు.