LOADING...
Pasta History : పాస్తా చరిత్ర వెనుక అసలు కథ ఇదే… మార్కో పోలో కథ నిజమా?
పాస్తా చరిత్ర వెనుక అసలు కథ ఇదే… మార్కో పోలో కథ నిజమా?

Pasta History : పాస్తా చరిత్ర వెనుక అసలు కథ ఇదే… మార్కో పోలో కథ నిజమా?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 20, 2026
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాస్తా ఎక్కడ పుట్టిందో తెలుసా? ఈ రోజుల్లో పాస్తాను ప్రపంచానికి పరిచయం చేసిన దేశంగా ఇటలీని గుర్తిస్తారు. నూడుల్స్ తరహా ఆహారాలు ఇతర దేశాల్లోనూ ఉన్నప్పటికీ, పాస్తా మాత్రం ఇటలీలోనే ఒక ప్రధాన ఆహారంగా రూపుదిద్దుకుంది. చరిత్రను పరిశీలిస్తే, ఐదవ శతాబ్దం నాటికే అరబ్బులు ఎండబెట్టిన పాస్తాను తయారు చేసినట్లు రికార్డులు సూచిస్తున్నాయి. తొమ్మిదవ శతాబ్దంలో అరబ్ పాలకులు సిసిలీకి వచ్చిన సమయంలో, డ్రై పాస్తా తయారీకి సంబంధించిన పద్ధతులను అక్కడికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇటాలియన్లు వాటిని మరింత మెరుగుపరచి అభివృద్ధి చేశారు. ప్రసిద్ధ కథ ప్రకారం, 13వ శతాబ్దంలో మార్కో పోలో చైనా నుంచి పాస్తాను ఇటలీకి తీసుకువచ్చాడని చెబుతారు.

వివరాలు 

క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దానికి చెందిన ఎట్రుస్కాన్ సమాధుల్లో పాస్తా తయారీ..

ఇది చాలావరకు కల్పితం. మార్కో పోలో ఆసియా ప్రయాణం చేయకముందే ఇటలీలో పాస్తా వినియోగంలో ఉందని చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఈ కథ ఒక వాస్తవం కంటే పురాణంగా మారిపోయింది. ఇక క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దానికి చెందిన ఎట్రుస్కాన్ సమాధుల్లో లభించిన పురావస్తు అవశేషాల్లో, పాస్తా తయారీలో ఉపయోగించే పరికరాల రూపాలు చెక్కబడి ఉండటం గమనార్హం. 17వ శతాబ్దం నాటికి నేపుల్స్ పాస్తా ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా మారింది.

వివరాలు 

ఇటాలియన్లు లస వెళ్లినప్పుడు, పాస్తా కూడా వారి వెంట ప్రపంచమంతా వ్యాపించింది

పాస్తా తక్కువ ఖర్చుతో లభించడం, కడుపు నిండేలా ఉండటం, ఎక్కువకాలం నిల్వ ఉండటం వంటి లక్షణాల వల్ల అక్కడి కార్మిక వర్గానికి ఇది అత్యంత అనుకూలమైన ఆహారంగా నిలిచింది. తదనంతరం ఇటాలియన్లు యూరప్‌తో పాటు అమెరికా దేశాలకు వలస వెళ్లినప్పుడు, పాస్తా కూడా వారి వెంట ప్రపంచమంతా వ్యాపించింది. కాలక్రమేణా పాస్తా ఇటాలియన్ వంటకాలకు ప్రతీకగా మారి, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.

Advertisement