Page Loader
Happy New Year: 2025లో లాంగ్‌ వీకెండ్‌లతో మీ సెలవులను ప్లాన్ చేయండి!
2025లో లాంగ్‌ వీకెండ్‌లతో మీ సెలవులను ప్లాన్ చేయండి!

Happy New Year: 2025లో లాంగ్‌ వీకెండ్‌లతో మీ సెలవులను ప్లాన్ చేయండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 31, 2024
04:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొద్దిగంటల్లో 2025 నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఎక్కడికి వెళ్ళాలి అనేకమంది మనస్సులో ఉంటుంది. అయితే ఈ ఏడాది సెలవులు ఎప్పుడు ఉంటాయో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. 2025లో అనేక లాంగ్ వీకెండ్లు, సెలవులు ఎప్పుడెప్పుడు వచ్చాయో ఓసారి తెలుసుకుందాం. హోలీ సెలవులు 2025లో మొదటి లాంగ్ వీకెండ్ హోలీ సందర్భంగా వస్తుంది. మార్చి 14న శుక్రవారం హోలీ జరుపుకుంటారు. హోలికా దహన్ మార్చి 13న గురువారం జరగనుంది. ఈ నేపథ్యంలో, మార్చి 13 నుండి మార్చి 16 వరకు 4 రోజుల లాంగ్ వీకెండ్ ఉంటుంది, కాబట్టి ప్రయాణానికి ఇది మంచి అవకాశం.

Details

 స్వాతంత్య్ర దినోత్సవం 

ఆగస్టు 15 శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సెలవుగా ఉంటుంది. ఆగస్టు 16 శనివారం సెలవుతో మూడు రోజుల వీకెండ్ ఉంటుంది. ఇదే సమయంలో జన్మాష్టమి కూడా ఆగస్టు 16న వస్తుంది. దీంతో మూడ్రోజుల పాటు సమీప ప్రదేశాలకు రోడ్డు ట్రిప్‌కు వెళ్లవచ్చు లేదా రిసార్ట్‌కి వెళ్లే అవకాశం ఉంటుంది. దసరా సెలవులు 2025లో దసరా సెలవులు కూడా లాంగ్ వీకెండ్‌గా ఉంటాయి. దుర్గాష్టమి సెప్టెంబర్ 30 (మంగళవారం), మహానవమి అక్టోబర్ 1 (బుధవారం), గాంధీ జయంతి, విజయదశమి అక్టోబర్ 2 (గురువారం) తేదీలలో వస్తాయి. దీంతో సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 2 వరకు సుదీర్ఘ వీకెండ్‌ను ఎంజాయ్‌ చేయవచ్చు.

Details

 బక్రీద్ సెలవు 

2025 జూన్ 7న శనివారం బక్రీద్ వస్తుంది. ఇక ఆదివారం కూడా సెలవు ఉంటుంది. దీంతో వరుసగా రెండు రోజులు సెలవులు వస్తాయి. ఈ రోజుల్లో ఎక్కడికైనా వెళ్లవచ్చు. రక్షాబంధన్ ఆగస్టు 9న శనివారం రక్షాబంధన్ పండుగ జరగడం, ఆదివారం సెలవుతో రెండు రోజుల సెలవులు ఉంటాయి. ఈ సందర్భంగా కుటుంబంతో పాటు ఎక్కడికైనా వెళ్లడం చాలా సౌకర్యవంతం. ఈ 2025లో వచ్చే లాంగ్ వీకెండ్లతో మీ సెలవులను బాగా ప్లాన్ చేసుకొనే అవకాశం ఉంటుంది.