Page Loader
IRCTC Andaman Tour 2025 : అండమాన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. న్యూ ఇయర్ సందర్భంగా IRCTC టూర్ ప్రత్యేక ప్యాకేజీ 
అండమాన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. న్యూ ఇయర్ సందర్భంగా IRCTC టూర్ ప్రత్యేక ప్యాకేజీ

IRCTC Andaman Tour 2025 : అండమాన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. న్యూ ఇయర్ సందర్భంగా IRCTC టూర్ ప్రత్యేక ప్యాకేజీ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 22, 2024
01:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

IRCTC టూరిజం నూతన సంవత్సర సందర్భంగా "AMAZING ANDAMAN EX HYDERABAD (SHA18)" పేరుతో అండమాన్ టూర్ ప్యాకేజీని ప్రారంభిస్తోంది. ఈ ప్యాకేజీ మొత్తం 6 రోజులపాటు ఉంటుంది. హైదరాబాద్ నుంచి ప్రారంభం అయిన ఈ టూర్ ఫిబ్రవరి 12వ తేదీ నుండి అందుబాటులో ఉంటుంది. మొదట హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఉదయం 6:35 గంటలకు ఈ ఫ్లైట్ బయల్దేరుతుంది. 9:15 గంటలకు పోర్ట్ బ్లెయిర్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

Details

పర్యటన వివరాలివే

1)మొదటి రోజు సెల్యూలర్ జైల్ మ్యూజియం, కార్బిన్ కోవ్ బీచ్ సందర్శన, లైడ్ అండ్ సౌండ్ షో. 2) రెండవ రోజు హావెలాక్‌కు ప్రయాణం, రాధానగర్ బీచ్‌లో లంచ్, రాత్రికి హావెలాక్‌లో ఉండడం 3) మూడవ రోజు కాలా పతర్ బీచ్, సీతపుర్ బీచ్, లక్ష్మణ్ పుర్ బీచ్ సందర్శన. 4) నాల్గవ రోజు భరత్ నగర్ బీచ్, స్విమ్మింగ్, స్పోర్ట్స్ ఈవెంట్స్, ఫోర్ట్ బ్లెయిర్ సందర్శన. 5) ఐదో రోజు రోస్ ఐల్యాండ్, నార్త్ బే ఐల్యాండ్, స్పోర్ట్స్ ఈవెంట్స్, సముద్రిక మెరైన్ మ్యూజియం సందర్శన. 6) ఆఖరి రోజు పోర్ట్ బ్లెయిర్ నుండి హైదరాబాద్‌కి ప్రయాణం.

Details

 ప్యాకేజీ ధరలు 

సింగిల్ ఆక్యూపెన్సీ : రూ.68,320 డబుల్ ఆక్యూపెన్సీ : రూ.51,600 ట్రిపుల్ ఆక్యూపెన్సీ : రూ.49,960 పిల్లల కోసం ప్రత్యేక ధరలు ఉంటాయి. ఈ ప్యాకేజీలో హోటల్, ఫుడ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు కలిపి ఉంటాయి. బుకింగ్, మరిన్ని వివరాలు కోసం [IRCTC Tourism](https://www.irctctourism.com/) వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.