పెట్: ఎలాంటి బ్రీడ్ కుక్కపిల్లను పెంచుకోవాలో మీకు తెలుసా? ఇది తెలుసుకోండి
చాలామందికి పెట్స్ ని పెంచుకోవాలని ఇష్టంగా ఉంటుంది. కొందరు కుక్కలను పెంచుకుంటే కొందరు పిల్లులను పెంచుకుంటారు. కుక్కపిల్లల్ని పెంచుకోవాలనుకునే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల కుక్కపిల్లల జాతులు ఉన్నాయి. ఎలాంటి బ్రీడ్ ఐతే మీరున్న ప్రదేశపు వాతావరణానికి సూట్ అవుతుందో తెలుసుకోవాలి. లేదంటే అది కుక్క పెరుగుదలపై ప్రభావం పడుతుంది. ప్రస్తుతం ఇండియా వాతావరణానికి సరిపడే కొన్ని రకాల జాతుల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఇండియన్ పరియ: ఇది భారతదేశ వాతావరణాన్ని బాగా తట్టుకుంటుంది. సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఇది పెరగగలదు. ఎక్కువ బొచ్చు పెరగదు కాబట్టి దీని భరించడం సులభం అవుతుంది.
మరిన్ని జాతులు
రాజపళయం: తమిళనాడుకు చెందిన ఈ జాతి కుక్కపిల్లలు, వేడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉండగలవు. వీటికి బలం ఎక్కువగా ఉంటుంది. గ్రే హౌండ్స్: వీటిని అథ్లెటిక్ కుక్కపిల్లలని చెప్పుకోవచ్చు. వీటి పరుగు వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. పొడి ప్రాంతాల్లో గానీ, వేడి ప్రాంతాల్లో గానీ ఇవి బతగ్గలవు. బుల్ మాస్టిఫ్: మీ ఇంటి వైపు ఎవ్వరినీ రాకుండా చేసే కుక్క ఇది. సురక్షితం కాని ప్రాంతాల్లో ఇళ్ళు కట్టుకున్న వారు ఇలాంటి కుక్కను పెంచుకుంటే సెక్యూరిటీ అక్కర్లేదు చూడడానికి పెద్దగా భయంకరంగా ఉంటాయి. కొత్తలో శిక్షణ అవసరం. డాబర్ మాన్: ఈ జాతి కుక్కలు కూడా మంచి సెక్యూరిటిని ఇస్తాయి. యజమాని పట్ల నిజాయితీతో ఉంటుంది. అంతేకాదు, ఇవి చాలా తెలివైనవి.