
మొక్కల్లో మాంసం దొరికే ఆహారాలు, వాటివల్ల కలిగే లాభాలు, నష్టాలు
ఈ వార్తాకథనం ఏంటి
మాంసం తినని వాళ్ళకు మాంసహార రుచి ఎలా ఉంటుందో తెలియదు. అలాగే మాంసంలోని పోషకాలు అందవని మీరు వాళ్ళ మీద జాలిపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాంసం లాంటి రుచితో, పోషకాలతో కూడిన మొక్కలు అందుబాటులో ఉన్నాయి.
వెజ్ తినేవాళ్లకు ఇదొక వరమని చెప్పవచ్చు. ఇక్కడ విశేషమేమిటంటే, క్రీస్తు పూర్వం 206సంవత్సరంలోనే మాంసానికి ఆల్టర్నేటివ్ గా మాంసకృత్తులు కలిగి ఉండే టోఫు మొక్క గురించి తెలుసుకున్నారు.
మాంసకృత్తులను కలిగి ఉండే మొక్కల్లో మాంసంలో ఉండే ప్రోటీన్, కొవ్వు, విటమిన్లు, పోషకాలు ఉంటాయి. ఈ మొక్కల నుండి ఆహార పదార్థాల రుచి కూడా మాంసం మాదిరిగానే ఉంటుంది. టోఫు, సోయా, పెసరగింజలు, పప్పు ధాన్యాలను మొక్కల మాంసంగా చెప్పవచ్చు.
ఆహారం
నాన్ వెజ్ తినని వారికి అందుబాటులో ఉన్న మొక్కల మాంసం
బంగాళదుంప పిండి, పుట్టగొడుగులు, కొబ్బరినూనె, గింజలు, మొలకలు, వేరుశనగ వంటి వాటిల్లో మాంసకృత్తులు అధికంగా ఉంటాయి.
మొక్కల మాంసం తినడం వల్ల కలిగే లాభాలు:
జంతువుల మాంసంతో పోలిస్తే మొక్కల మాంసంలో పోషకాలు తక్కువగా ఉంటాయి. కాకపోతే దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ప్రోటీన్ కూడా తగినంతగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి.
మొక్కల మాంసం వల్ల నష్టాలు: జంతుమాంసంలో మాదిరిగా వీటిల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉండవు. సోడియం ఎక్కువగా ఉండి బ్లడ్ ప్రెషర్ ని పెంచుతాయి. చక్కెర కూడా ఎక్కువుంటుంది. ఖరీదు చాలా ఎక్కువ.
ఐతే పరిమితంగా తీసుకోవడం వల్ల పెద్ద నష్టమేమీ ఉండదని గుర్తుంచుకోండి. శాఖాహారులు హ్యాపీగా తినవచ్చు, మాంసాహారంలోని పోషకాలను తమ శరీరానికి అందించవచ్చు.