అందం: మిలమిల మెరిసే కనుల కోసం 5 అద్భుత ఐ లైనర్ లుక్స్
ముఖంలో అందమైన భాగం కళ్ళు. అవి అందంగా కనిపిస్తే ముఖం మెరిసిపోతుంటుంది. అందుకే కళ్ళను మరింత అందంగా చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఐ లైనర్స్ వాడుతుంటారు. ఇవి కళ్ళను మరింత పెద్దగా, అందంగా కనిపించేలా చేస్తాయి. ప్రస్తుతం టాప్ 5 ఐ లైనర్స్ లుక్స్ గురించి తెలుసుకుందాం. వింగ్ ఐ లైనర్: ఇది ఎక్కువ మందికి తెలిసిన ఐ లైనర్ లుక్. చాలా పాత ఫ్యాషనే అయినా కూడా ఎప్పుడూ కొత్తగా కనిపిస్తుంటుంది. పక్షిరెక్క మాదిరిగా కళ్ళ వెంట గీసే గీతలు కళ్ళకి కొత్త రకమైన అందాలను తీసుకొస్తాయి. సన్నగా లేదా లావుగా ఉండే వింగ్స్ ని మీరు మీ కనురెప్ప మీద గీయవచ్చు.
కళ్ళ అందాన్ని మరింత పెంచే ఐ లైనర్స్ లుక్స్
గ్రాఫిక్ ఐ లైనర్: ఈ రకం లుక్ తో మీ కళ్ళు వింతగా కనిపిస్తాయి. నలుపు లేదా నీలం రంగుల్లోని ఐ లైనర్స్ తో మీ కనురెప్పల చుట్టూరా విభిన్న ఆకారాల్లో గీయండి. క్యాట్ ఐ లైనర్: ఇది కూడా వింగ్ ఐ లైనర్ లుక్ ని పోలి ఉంటుంది. కాకపోతే పై కనురెప్ప మీద కొంచెం దళసరిగా గీయాలి. కింద కనురెప్ప మీద చాలా సన్నగా గీయాలి. కంటిలోపలి భాగంలో మూలలను కొద్దిగా కింది వైపునకు గీయాలి. ఇంకా చేపతోక మాదిరిగా కనిపించేలా కూడా గీసుకోవచ్చు. దీనికోసం కళ్ళ బయటి భాగంలో చేపతోక మాదిరిగా ఐ లైనర్ తో గీయాల్సి ఉంటుంది. పై కనురెప్పను కింది కనురెప్పను చేపతోక ఆకారంలో కలపాలి.