
Krishna Temples in Hyderabad: కృష్ణాష్టమి సందర్భంగా హైదరాబాద్‌లో పాపులర్ కృష్ణ ఆలయాలు.. లొకేషన్స్, సందర్శన సమయాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీమహా విష్ణువు దశావతారాల్లో 8వ అవతారం శ్రీ కృష్ణుడు. ఆగస్ట్ 16, శనివారం దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. హిందువులకే కాక, విదేశీయులూ ఈ వేడుకల్లో పాల్గొంటారు. కృష్ణుడు జన్మించిన రోజును కృష్ణాష్టమి లేదా గోకులాష్టమి అని పిలుస్తారు. ఈ సందర్భంలో భాగ్యనగరవాసులు హైదరాబాద్‌లోని ప్రధాన కృష్ణ ఆలయాలను సందర్శించవచ్చు.
Details
ఇస్కాన్ టెంపుల్ (శ్రీ రాధా మదన మోహన ఆలయం)
ఇస్కాన్ ఆలయాలు దేశవ్యాప్తంగా అందమైన ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉన్నాయి. హైదరాబాద్‌లో అబిడ్స్‌లో ఉన్న ఈ ఆలయం శ్రీ రాధా మదన మోహన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శ్రీ గౌర-నితై, శ్రీ జగన్నాథ బలభద్ర-సుభద్ర, శ్రీ రాధా మదన-మోహనుల విగ్రహాలు ఉన్నాయి. కృష్ణాష్టమి రోజున మహాభిషేకాలు, మహా ప్రసాద వితరణ, హారతులు నిర్వహిస్తారు. సందర్శనా సమయాలు ఉదయం 4:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8:30 వరకు ప్రవేశ రుసుము లేదు
Details
శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం
కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ, గోవర్దన గిరిలో ఈ ఆలయం ఉంది. ప్రకృతి మధ్యలో శ్రీ కృష్ణుడు రుక్మిణీ దేవి, సత్యభామ సమేతంగా దర్శనమిస్తాడు. ఇక్కడ గోదాదేవిని కూడా చూడవచ్చు. ఆలయం పక్కనే గోశాల కూడా ఉంది. సందర్శనా సమయాలు ఉదయం 6:00-11:30 సాయంత్రం 5:00-రాత్రి 8:00 శనివారం, ఆదివారాల్లో రాత్రి 9:00 వరకు భక్తులకు అనుమతి
Details
శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్
బంజారా హిల్స్‌లోని ఈ ఆలయం పూరీ ఆలయానికి ప్రతిరూపం. గర్భగుడిలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర కొలువై ఉంచారు. ప్రాంగణంలో గణపతి, శివ, లక్ష్మీదేవి, విమలా దేవి, ఆంజనేయుడు, నవగ్రహాలున్నాయి. గోడలపై భాగవత, దశావతార చిత్రాలు ఆకట్టుకుంటాయి. 3000 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించి, ఒడిశా నుంచి సుమారు 600 టన్నుల ఇటుక రాయి తరలించారు. సందర్శనా సమయాలు ఉదయం 6:00-మధ్యాహ్నం 12:00 సాయంత్రం 5:00-రాత్రి 9:00 ప్రవేశ రుసుము లేదు
Details
హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్
బంజారా హిల్స్ రోడ్ నం. 12లో 2018లో నిర్మించిన ఈ ఆలయం ప్రసిద్ధం. ఇక్కడ రాధా గోవింద, లక్ష్మీ నారసింహ స్వామిలను దర్శించవచ్చు. కృష్ణాష్టమి సందర్భంగా భక్తులతో కళకళలాడిపోతుంది. సందర్శనా సమయాలు ఉదయం 7:15-12:30 సాయంత్రం 5:15-రాత్రి 8:45