LOADING...
Aloo ki Jalebi:ఆలూతో నోరూరించే జిలేబీలు.. తక్కువ పదార్థాలతో సింపుల్​గా రెడీ!
ఆలూతో నోరూరించే జిలేబీలు..తక్కువ పదార్థాలతో సింపుల్​గా రెడీ!

Aloo ki Jalebi:ఆలూతో నోరూరించే జిలేబీలు.. తక్కువ పదార్థాలతో సింపుల్​గా రెడీ!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 04, 2026
01:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

జిలేబీలు ఎక్కువ మంది ఇష్టపడే స్వీట్. ఇవి పైకి క్రంచీగా,లోపల సాఫ్ట్​గా, జ్యూసీగా ఉంటాయి. ఈసారి మనం బంగాళదుంపతో జిలేబీల రిసిపీ చూద్దాం. కష్టపడకుండా, కొన్ని సులభమైన స్టెప్స్ పాటిస్తే, మధురమైన జిలేబీలు చాలా సులభంగా అప్పటికప్పుడే చేసుకోవచ్చు. మరి ఇక ఆలస్యం చేయకుండా వీటిని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా?

వివరాలు 

కావాల్సిన పదార్థాలు :

బంగాళదుంపలు - 2 పెరుగు - అర కప్పు మైదాపిండి - 200 గ్రాములు యాలకుల పొడి - పావు స్పూన్ కుంకుమపువ్వు - చిటికెడు బెల్లం తురుము - 3 కప్పులు బేకింగ్​సోడా - చిటికెడు

వివరాలు 

తయారీ విధానం :

రెండు బంగాళదుంపలను శుభ్రంగా కడిగి, పొట్టలు తీసి, గిన్నెలో తగినంత నీటితో ఉడికించాలి. ఉడికిన తర్వాత వాటిని మృదువుగా మాష్ చేసుకోవాలి. కడాయిలో 3 కప్పుల బెల్లం తురుము, 1.5 కప్పుల నీరు వేసి స్టవ్‌పై ఉంచాలి. ఇప్పుడు ½ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు కుంకుమపువ్వు చేర్చి 10 నిమిషాల పాటు మరిగించాలి. బెల్లం పాకం లేతగా, స్టిక్కీగా ఉండే విధంగా చూసుకోవాలి. కావాల్సిన కన్సిస్టెన్సీలో పాకం రెడీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి. మిక్సింగ్ బౌల్లో 200 గ్రా మైదా, మాష్ చేసిన బంగాళదుంప, అర కప్పు పెరుగు, చిటికెడు బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి.

Advertisement

వివరాలు 

తయారీ విధానం :

ఇప్పుడు పైపింగ్​ బ్యాగ్​లో నాజిల్​ వేయాలి. ఇందులో రెడీ చేసుకున్న​ మిశ్రమాన్ని కొద్దిగా వేయాలి. పైపింగ్ బ్యాగ్ లేకపోతే, పాల ప్యాకెట్ ఉపయోగించి చివర రంధ్రం చేసి కూడా చేయవచ్చు. అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోయాలి. ఆయిల్ హీట్ అయిన అనంతరం మంటను లో ఫ్లేమ్​లో ఉంచి పిండిని జిలేబీల్లా వత్తుకోవాలి. మొదట లో ఫ్లేమ్, తర్వాత మీడియం ఫ్లేమ్‌లో రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన జిలేబీలను వేడెక్కిన బెల్లం పాకంలో 1 నిమిషం అలాగే వదివేయాలి. 1 నిమిషం తర్వాత జిలేబీలను పాకం నుండి తీసి, ప్లేట్‌లో పెట్టి సర్వ్ చేయండి.

Advertisement