
ఆరోగ్యం: వడదెబ్బ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి చేయాల్సిన పనులు
ఈ వార్తాకథనం ఏంటి
ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు తన ప్రతాపాన్ని తీవ్రంగా చూపిస్తున్నాడు. ఇలాంటి సమయాల్లో వడదెబ్బ సమస్య ఉంటుంది. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల ఈ సమస్య వస్తుంది.
శరీర ఉష్ణోగ్రత 40డిగ్రీల సెంటిగ్రేడు దాటితే వడదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. సాధారణంగా ఈ పరిస్థితి ఎక్కువగా పిల్లలు లేదా ముసలివారిలో కనిపిస్తుంటుంది.
వడదెబ్బ వల్ల శరీరంలో అవయవాలు సరిగ్గా పనిచేయకుండా మారిపోతాయి. ఈ కారణంగా మరణం సంభవించే అవకాశం ఉంది.
వడదెబ్బ లక్షణాలు:
ఇందులో ప్రముఖంగా మూర్ఛపోయి పడిపోవడం జరుగుతుంది. అలాగే చెమట రాకపోవడం, వాంతులు, తలనొప్పి, వికారం, చిరాకు, అలసట, చర్మం పొడిబారడం, చర్మం ఎర్రగా మారడం జరుగుతుంది. అలాగే హృదయ స్పందన కూడా పెరుగుతుంది.
Details
వడదెబ్బ నుండి రక్షించుకోవడానికి చేయాల్సిన పనులు
కావాల్సినన్ని నీళ్ళు తాగండి. ఎల్లప్పుడూ శరీరంలో నీటిని ఉంచుకునేలా జాగ్రత్త పడండి. మధ్యాహ్నం పూట బయటకు వెళ్ళకపోవడమే మంచిది.
ఏ పనులున్నా ఉదయం, సాయంత్రాల్లో మాత్రమే చేసుకోండి. ఆల్కహాల్ వంటివి మానుకోండి. ఆల్కహల్ కారణంగా డీ హైడ్రేషన్ అవుతుంది. అది వడదెబ్బకు దారి తీయవచ్చు.
బిగుతుగా ఉండే దుస్తులు ధరించకపోవడం మంచిది. లేత రంగులోని వదులుగా ఉండే దుస్తులు ధరిస్తే బగుంటుంది. బిగుతైన దుస్తులు శరీర వేడిని మరింత పెంచుతాయి.
ఎండలో బయటకు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా టోపీ పెట్టుకోండి. కనీసం టవల్ అయినా చుట్టుకోండి. అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి. బయటకు వెళ్ళినపుడు మీతో పాటు ఖచ్చితంగా వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి.