చర్మ సంరక్షణ: ఆరోగ్యకరమైన చర్మం మీ సొంతం కావాలంటే సాధారణ జనాలు నమ్మే ఈ అపోహాలు వదిలేయండి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుత కాలంలో చర్మ సంరక్షణపై శ్రద్ధ చూపాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న ఆహార అలవాట్లు, ఎక్కువవుతున్న ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం.. మొదలగు వాటి కారణంగా చర్మం ఎఫెక్ట్ అవుతోంది.
అయితే చాలామందికి చర్మ సంరక్షణ విషయంలో కొన్ని అపోహాలు ఉన్నాయి. చర్మం మీద శ్రద్ధ తీసుకునే వాళ్ళు ఈ అపోహాలను ఇప్పుడే వదిలేయాలి. ఇంతకీ ఈ అపోహాలేంటో చూద్దాం.
ముఖాన్ని ఎక్కువసార్లు కడగడం మంచిది:
ఇది అతి పెద్ద అపోహ అని చెప్పవచ్చు. ముఖాన్ని ఎక్కువ ఎక్కువసార్లు కడడం వల్ల చర్మం నుండి ఉత్పత్తి అయ్యే సహజ నూనెలు తొలగిపోతాయి. దానివల్ల చర్మం పొడిబారిపోయి చికాకును కలిగిస్తుంటుంది.
Details
చర్మ సంరక్షణ విషయంలో అందరిలో ఉండే అపనమ్మకాలు
రసాయనాలు లేని అన్ని చర్మసాధనాలు ఆరోగ్యానికి మంచిది
ఒక్కొక్కరి చర్మం ఒక్కోలా ఉంటుంది. ఎవరికి ఏ రకమైన చర్మసాధనం సూట్ అవుతుందో కరెక్ట్ గా ఎవ్వరూ చెప్పలేరు.
కాబట్టి రసాయనాలు లేని చర్మసాధనాలన్నీ మన శరీరానికి సూట్ అవుతాయని అనుకుంటే పొరపాటు పడినట్టే. ఏ చర్మ సాధనాన్ని అయినా ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసి వాడితే మంచిది.
కేవలం బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే సన్ స్క్రీన్ అవసరం
బయటకు వెళ్లినప్పుడు మాత్రమే కాదు, ఇంట్లో కూర్చుండి కంప్యూటర్ మీద ఎక్కువగా పని చేసే వారు కూడా సన్ స్క్రీన్ వాడాల్సి ఉంటుంది. లేదంటే కంప్యూటర్ స్క్రీన్ నుండి వచ్చే నీలి కాంతి మీ చర్మానికి హాని చేస్తుంది.
Details
చర్మం మండుతున్నట్లయితే ప్రోడక్ట్ పనిచేస్తుందని అనుకోవడం
అందంగా కనిపించాలంటే అమితమైన నొప్పిని భరించాల్సిన అవసరం లేదు.
ఏదైనా ప్రోడక్ట్ ని వాడుతున్నప్పుడు తేలికపాటి మంట కలగడం సహజం, కానీ ఆ మంట మరీ ఎక్కువగా ఉంటే ఆ ప్రోడక్ట్ మీ చర్మానికి సరైనది కాదని అర్థం.
అందుకే వెంటనే మీరు మర్దన చేసుకున్న ఆ ప్రోడక్ట్ ని కడిగేస్తే మంచిది.