NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / హ్యాపీ బర్త్ డే కేసీఆర్: జాతీయ రాజకీయాలే టార్గెట్
    తదుపరి వార్తా కథనం
    హ్యాపీ బర్త్ డే కేసీఆర్: జాతీయ రాజకీయాలే టార్గెట్

    హ్యాపీ బర్త్ డే కేసీఆర్: జాతీయ రాజకీయాలే టార్గెట్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 17, 2023
    01:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర రావు, ఈరోజు 69వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా చరిత్రలో స్థానం సంపాదించుకున్న కేసీఆర్ కు అన్ని వర్గాల ప్రజల నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

    ఈ పుట్టినరోజు కేసీఆర్ కు చాలా ప్రత్యేకం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి నుండి భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలనే ప్రయత్నం ఈ సంవత్సరమే మొదలైంది.

    అందుకే భారత రాష్ట్ర సమితి శ్రేణులు కూడా కేసీఆర్ పుట్టినరోజును ఘనంగా నిర్వహించాలని భావించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసారు. ఇటు సోషల్ మీడియాలోనూ కేసీఆర్ బర్త్ డే గురించి వీడియోలు వస్తూనే ఉన్నాయి.

    కేసీఆర్

    రైతు సర్కార్ నినాదంతో జాతీయ రాజకీయాలు

    జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర ఎలా ఉంటుందన్నది ఇప్పుడే ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. తెలంగాణలో ప్రవేశ పెట్టిన పథకాలను దేశమంతటా అమలు చేస్తానని కేసీఆర్ చెబుతున్నారు.

    ముఖ్యంగా రైతు భీమా, రైతు బంధు వంటి పథకాలు దేశవ్యాప్తంగా అమల్లో చేయవచ్చని, దానికోసం రైతు సర్కార్ రావాలని, అది బీఆర్ఎస్సే అని కేసీఆర్ చెబుతున్నారు.

    మరి బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో పటిష్టంగా నిర్మించడానికి కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి. ఇదిలా ఉంచితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.

    అలాగే తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. సినిమా తారల్లో చిరంజీవి, మహేష్ బాబు ఇంకా చాలామంది శుభాకాంక్షలు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం? తెలంగాణ
    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే కేసీఆర్‌ను జాతీయ స్థాయిలో నిలబెడతాయా? తెలంగాణ
    బీఆర్ఎస్ కిసాన్ సెల్‌ జిల్లా అధ్యక్షుల నియామకం వేగవంతం.. కేసీఆర్ ఫోకస్ భారతదేశం
    ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆయనకేనా? భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025