Page Loader
కొండగట్టు క్షేత్రానికి మరో రూ.500కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న సీఎం కేసీఆర్

కొండగట్టు క్షేత్రానికి మరో రూ.500కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్

వ్రాసిన వారు Stalin
Feb 15, 2023
03:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అంజన్న క్షేత్రం అభివృద్ధికి మరో రూ.500కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఉదయం కొండగట్టుకు హెలికాప్టర్‌లో బయలుదేరిన సీఎం కేసీఆర్, తొలుత నాచుపల్లి సమీపంలోని జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో దిగారు. అక్కడి నుంచి బస్సులో యాగశాలకు చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కేసీఆర్

కొండగట్టు క్షేత్రాన్ని ప్రముఖ ఆలయంగా తీర్చిదిద్దుతాం: సీఎం కేసీఆర్

అంజన్నకు పూజలు నిర్వహించిన తర్వాత ఆలయ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలయ అభివృద్ధికి మరో రూ. 500కోట్లను కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే ఆలయానికి రూ. రూ.100 కోట్లను మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో కొండగట్టు ఆలయానికి సీఎం కేసీఆర్ మొత్తం రూ.600కోట్లను కేటాయించినట్లయ్యింది. కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని త్వరలోనే ప్రముఖ ఆలయంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, టీఎస్‌ ప్లానింగ్‌ బోర్డు ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌, రాజ్యసభ ఎంపీ దివకొండ దామోదర్‌రావు, ఎమ్మెల్సీలు ఎల్‌.రమణ, భానుప్రసాదరావు కొండగట్టును సందర్శించారు.