Page Loader
తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్
బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్

తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్

వ్రాసిన వారు Stalin
Feb 15, 2023
09:31 am

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు బయలుదేరిన రైలు నెం.12727 గోదావరి ఎక్స్‌ప్రెస్ బుధవారం ఉదయం పట్టాలు తప్పింది. బీబీనగర్- ఘట్‌కేసర్ మధ్య ఈ ఘటన జరిగింది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పి ఒక్కసారిగా రైలు కుదుపునకు లోను కావడంతో అంత ఒక్కసారిగా నిద్రలేచారు. నిద్రలోంచి లేచిన వారికి కాసేపు ఏం జరిగిందో అర్థం కాలేదు. చివరికి రైలు పట్టాలు తప్పిందని తెలియడంతో అందులో నుంచి పరుగులు తీశారు.

గోదావరి ఎక్స్‌ప్రెస్

ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు: రైల్వే అధికారులు

గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంపై రైల్వే అధికారుల స్పందించారు. ఈ ఘటనలో S1- S4, GS, SLR వంటి ఆరు కోచ్‌లు పట్టాలు తప్పినట్లు అధికారులు చెప్పారు. అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఎవరికి గాయాలు కాలేదని వెల్లడించారు. పట్టాలు తప్పిన కోచ్‌లను రైలు నుంచి వేరు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికుల వివరాల కోసం హెల్ప్‌లైన్ నంబర్‌(040 27786666)ను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు.