Promise Day In Valentine Week: వాలెంటైన్ వీక్‌లో 'ప్రామిస్ డే' ప్రాముఖ్యత ఏమిటి?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11న 'ప్రామిస్ డే'ను జరుపుకుంటారు.
ఇది వాలెంటైన్ వీక్‌లో అత్యంత ప్రత్యేకమైన రోజుల్లో ఒకటి. ప్రతీ సంబంధానికి ప్రామిస్ డే ఒక విశిష్టమైన గుణాన్ని అందిస్తుంది.
అయితే ప్రేమికులకు ఇది మరింత ముఖ్యమైన రోజు.
ఈ రోజు, గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది.
మన బంధం బలహీనపడితే, దాన్ని మళ్లీ ధృడంగా చేయడానికి ఇది ఉత్తమమైన రోజు.
అయితే, భాగస్వామికి ఇచ్చే హామీలు ఎంతవరకు నిబద్ధంగా ఉండాలి? నిజాయితీతో ఉండాలా? అన్నది చాలా ముఖ్యం.
వివరాలు
ఈ అలవాటు క్రమంగా సంబంధాన్ని దెబ్బతీస్తుంది
ఆరోగ్యకరమైన సంబంధాల కోసం, మన అభిరుచులు లేదా అభిప్రాయాలను ఎదురుగా ఉన్న వ్యక్తిపై బలవంతంగా రుద్దకూడదు.
మనం కోరుకున్నట్లు మారాలని వారు భావించేలా ఒత్తిడి తేవద్దు. ఈ అలవాటు క్రమంగా సంబంధాన్ని దెబ్బతీస్తుంది.
నిజమైన ప్రేమ అనేది భాగస్వామిని ఆయన స్వభావంతోనే అంగీకరించడంలో ఉంటుంది.
ఈ ప్రామిస్ డే సందర్భంగా, మీరు భాగస్వామిని మారాలని కోరకుండా ప్రేమిస్తానని హృదయపూర్వకంగా హామీ ఇవ్వండి.
గతంలో ఏమైనా జరిగినా, వాటిని అంగీకరించి ముందుకు సాగుతానని వాగ్దానం చేయండి.
వివరాలు
ఇలా అయితే.. ఎలాంటి సంబంధమైనా కొన్నాళ్లకే దెబ్బతింటుంది
ప్రేమికులు పరస్పరం మధురంగా మాట్లాడటం, బహుమతులు ఇవ్వడం ద్వారా ప్రేమను వ్యక్తపరచుకుంటారు.
ఒకరికి ఒకరు నమ్మకంగా తోడుగా ఉంటానని హామీ ఇస్తారు. అయితే, ప్రతి ఒక్కరూ ఈ హామీని నిలబెట్టుకోలేరు.
కానీ, హామీలను నిలబెట్టుకోవడంలోనే అసలైన ప్రేమకు అర్థం ఉంటుంది.
అబద్ధాలు చెప్పే అలవాటు ఉన్న వారికి ఎలాంటి సంబంధమైనా కొన్నాళ్లకే దెబ్బతింటుంది.
నిజాయితీకి విలువ ఇచ్చే ప్రతి ఒక్కరూ అబద్ధాలను అసహ్యించుకుంటారు.
కాబట్టి, ఈ ప్రామిస్ డే సందర్భంగా మీ భాగస్వామికి జీవితాంతం అబద్ధం చెప్పకుండా ఉంటానని హామీ ఇవ్వండి. ఇది మీ ప్రేమను మరింత బలపరిచే దివ్యమైన ప్రతిజ్ఞ అవుతుంది.