Paneer Bhurji: ఇంట్లోనే దాబా స్టైల్ రెస్టారెంట్ టేస్ట్ పనీర్ బుర్జీ.. అన్నం,చపాతీల్లోకి తింటే నోట్లో వెన్నలా కరిగిపోతుంది
ఈ వార్తాకథనం ఏంటి
వేడివేడి అన్నం, చపాతీ, రోటీ, పులావ్‌లోకి పనీర్ బుర్జీ వేసి తింటుంటే అద్భుతంగా ఉంటుంది. అందుకే హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలకు వెళ్లినప్పుడు చాలామంది దీనినే ఎక్కువగా ఆర్డర్ చేస్తుంటారు. కొందరు ఇంట్లోనూ ఈ వంటకాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు. అలా మీకోసం ఈ రోజు పంజాబీ దాబా స్టైల్‌లో తయారు చేసే పనీర్ బుర్జీ రెసిపీని తీసుకొచ్చాం. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ పాటిస్తే, నోట్లో వేసుకున్న వెంటనే వెన్నలా కరిగిపోయేలా అద్భుతమైన రుచి వస్తుంది.
వివరాలు
కావాల్సిన పదార్థాలు :
పనీర్ - 200 గ్రాములు శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు పసుపు - పావు టీ స్పూన్ ఉప్పు - అర టీ స్పూన్ ధనియాల పొడి - 1 టీ స్పూన్ కారం - 1 టీ స్పూన్ కసూరి మెంతి - 1 టేబుల్ స్పూన్ గరం మసాలా - 1 టీ స్పూన్ పెరుగు - ముప్పావు కప్పు పాలు - పావు కప్పు నెయ్యి - 4 టేబుల్ స్పూన్లు కశ్మీరీ కారం - 1 టేబుల్ స్పూన్ బటర్ - 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర - అర టీ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు పచ్చిమిర్చి - 3
వివరాలు
తయారీ విధానం :
అల్లం తురుము- 1 టేబుల్ స్పూన్ టమోటాలు - 3 కొత్తిమీర -కొద్దిగా నిమ్మరసం- 1 టీ స్పూన్ ముందుగా 200 గ్రాముల పనీర్‌ను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలను ముక్కలుగా, పచ్చిమిర్చి మరియు టమోటాలను తరిగి సిద్ధంగా ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసి లో ఫ్లేమ్‌లో రంగు మారే వరకు వేయించాలి. శనగపిండి లైట్‌గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అదే పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కశ్మీరీ కారం వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి.
వివరాలు
తయారీ విధానం :
తర్వాత ఓ మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో వేయించిన శనగపిండి, పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ కసూరి మెంతి, ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. దీనిలో ముప్పావు కప్పు పెరుగు, పావు కప్పు పాలు, అలాగే ముందుగా కలిపి పెట్టుకున్న నెయ్యి-కశ్మీరీ కారం మిశ్రమాన్ని జత చేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. మళ్లీ స్టవ్ ఆన్ చేసి పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, రెండు టేబుల్ స్పూన్ల బటర్ వేసి కరిగించాలి. తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడే వరకు వేయించాలి.
వివరాలు
తయారీ విధానం :
ఇందులో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం, పచ్చిమిర్చి వేసి కలపాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమోటా ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. టమోటాలు ఉడికిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమం పేస్ట్‌ను జత చేయాలి. అవసరమైనంత ఉప్పు, కొద్దిగా కొత్తిమీర వేసి రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలి.
వివరాలు
తయారీ విధానం :
అనంతరం నాలుగు టేబుల్ స్పూన్ల వేడి నీళ్లు పోసి నెయ్యి పైకి తేలే వరకు ఉడికించాలి. తర్వాత పనీర్ ముక్కలు, ముప్పావు కప్పు వేడి నీళ్లు వేసి మరో రెండు నిమిషాలు మరిగించాలి. రెండు నిమిషాల తర్వాత చివరగా కొద్దిగా కొత్తిమీర, ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇంతే... పంజాబీ దాబా స్టైల్ పనీర్ బుర్జీ రెడీ! వేడి వేడి చపాతీ లేదా అన్నంతో సర్వ్ చేసుకుంటే రుచి అదిరిపోతుంది.