పుష్ అప్స్ లేదా బెంచ్ ప్రెస్.. ఛాతి వ్యాయామానికి ఏది ఉత్తమం
శరీరంలోని పైభాగం స్ట్రాంగ్ అవడానికి ఛాతికి సంబంధించిన వ్యాయామాలు ఖచ్చితంగా చేయాలి. దానివల్ల కడుపు పైభాగం నుండి భుజాల వరకు బలం పెరిగి పుష్టిగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఛాతి వ్యాయామం చేయాలనుకునే వారు పుష్ అప్స్ చేయవచ్చు, అలాగే బెంచ్ ప్రెస్ వ్యాయామం కూడా చేయవచ్చు. ఈ వ్యాయామాల వల్ల శరీరంలోని పైభాగం ఆరోగ్యంగా తయారవుతుంది. వీటిల్లో ఏది ఉత్తమమైనదో తెలుసుకుందాం. దానికన్నా ముందు వీటిని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పుష్ అప్స్ చేసేవారు, నేలమీదకు వంగి భుజాల పక్కగా నేలమీద చేతులను పెట్టాలి. నడుము భాగాన్ని వంచకుండా స్ట్రెయిట్ లైన్ మాదిరిగా శరీరాన్ని ఉంచి పుష్ అప్స్ చేయాలి. మొదట్లో ఇలా 10సార్లు చేయాలి. ఆ తర్వాత పెంచుకుంటూ వెళ్ళొచ్చు
బెంచ్ ప్రెస్ ఎలా చేయాలంటే
బెంచ్ ప్రెస్ చేయడానికి బెంచి మీద వెల్లకిలా పడుకుని, చేతుల్లో డంబెల్స్, లేదా బార్ బెల్ ని ఉంచుకుని వ్యాయామం చేయాలి. ఈ రెండు వ్యాయామాలు శరీర పైభాగానికి బలాన్ని చేకూరుస్తాయి. కాకపోతే బెంచ్ ప్రెస్ చేయాలంటే జిమ్ కి వెళ్లాలి. లేదంటే ఇంట్లోనే దానిక్కావల్సిన అన్ని వస్తువులు ఉండాలి. అదే పుష్ అప్స్ చేయడానికి ఎలాంటి ఎక్విమ్ మెంట్ అవసరం లేదు. కొంచెం చదునుగా ఉన్న ప్రదేశాన్ని చూసుకుని హ్యాపీగా ఎక్సర్ సైజ్ చేసుకోవచ్చు. ఈ రెండింట్లో ఏది ఉత్తమమైనదో చెప్పాల్సి వచ్చినపుడు, బెంచ్ ప్రెస్ ఎక్కువ మేలు చేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వ్యాయామంలో అదనంగా చేతుల్లో బరువులు కూడా ఉంటాయి కాబట్టి ఎక్కువ వ్యాయామం అవుతుంది.