Page Loader
Rajmargyatra: 'రాజ్‌మార్గ్ యాత్ర'.. ఫాస్టాగ్ రీఛార్జీ, స్పీడ్‌ అలర్ట్స్‌ ఒక్క యాప్‌లో!
'రాజ్‌మార్గ్ యాత్ర'.. ఫాస్టాగ్ రీఛార్జీ, స్పీడ్‌ అలర్ట్స్‌ ఒక్క యాప్‌లో!

Rajmargyatra: 'రాజ్‌మార్గ్ యాత్ర'.. ఫాస్టాగ్ రీఛార్జీ, స్పీడ్‌ అలర్ట్స్‌ ఒక్క యాప్‌లో!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 13, 2024
10:18 am

ఈ వార్తాకథనం ఏంటి

జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తాజాగా విడుదల చేసిన 'రాజ్‌మార్గ్‌యాత్ర' యాప్‌ ప్రయాణికులకు అనేక సదుపాయాలు అందిస్తోంది. ఇది పలు స్మార్ట్ ఫీచర్లతో రూపొందించారు. వాటి గురించి ఓ సారి క్లుప్తంగా తెలుసుకుందాం. 1)కీలక సమాచారం జాతీయ రహదారులపైన అవసరమైన సమాచారాన్ని, పటములు, రెస్టారెంట్లు, పెట్రోల్ బంకులు, ఆసుపత్రులు, ఏటీఎంలు వంటి వివరాలను తెలుసుకోవచ్చు. వాతావరణం, ట్రాఫిక్ పరిస్థితులపై అలర్టులు కూడా అందుబాటులో ఉంటాయి. 2) ఫిర్యాదులు రహదారులతో సంబంధించి ఏదైనా సమస్య ఉంటే 'Report An Issue On NH' ఆప్షన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫొటో, వీడియోలను జతచేసి పంపొచ్చు, ఫిర్యాదుల స్థితిని తెలుసుకోవచ్చు.

Details

3) ఫాస్టాగ్ సర్వీసులు

ఫాస్టాగ్ రీఛార్జి చేయడం, కొత్త ఫాస్టాగ్‌ కోసం దరఖాస్తు చేయడం వంటి సదుపాయాలు ఈ యాప్‌లో లభిస్తాయి. 4) టోల్ ప్లాజా వివరాలు ప్రయాణ రూట్‌లో టోల్ ప్లాజాల వివరాలు, ఫీజులు తెలుసుకోవచ్చు. 5) స్టార్ట్ అలర్ట్ ఎక్కువ వేగంతో వెళితే నోటిఫికేషన్ ద్వారా అలర్ట్ చేస్తుంది, భద్రత పరంగా ఇది చాలా ఉపయోగకరం. 6) ఇతర సదుపాయాలు ఎమర్జెన్సీ నంబర్లు, హైవే అసిస్టెన్స్ వంటి సదుపాయాలు కూడా ఈ యాప్‌లో ఉన్నాయి. ప్రయాణ వివరాలను రికార్డు చేసుకోవచ్చు. ఈ యాప్‌ను Google Play Store మరియు Apple Store నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.