
Rakhi Festival: రక్షా బంధన్ విశిష్టత.. చరిత్ర గురించి తెలుసుకుందాం
ఈ వార్తాకథనం ఏంటి
'రాఖీ'.. ఈ పేరు వినగానే అందరికీ అన్నా-చెల్లులు గుర్తుకొస్తున్నారు.
అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్లు ఒకరికి ఒకరు ప్రేమాభిమానులు పంచుకుంటూ రాఖీ పండగను సెలబ్రేట్ చేసుకుంటారు.
కష్టసుఖాల్లో తోడుగా ఉంటామని భరోసానిచ్చేదే 'రక్షా బంధన్'. రక్షా బంధన్ వస్తుందంటే చాలు కులమత బేధాలు, చిన్న పెద్దా తేడా లేకుండా దేశమంతా సోదరమయంగా మారిపోతుంది.
చెల్లి అన్నకు రాఖీ కట్టి తనకు రక్షగా ఉండాలని కోరుకుంటుంది.
Details
శ్రావణమాసంలో రక్షా బంధన్
ముఖ్యంగా ఈ పండగను శ్రావణమాసంలో చేస్తారు. ఈ ఏడాది రక్షాబంధన్ పండుగ ఆగస్టు 19, 2024 సోమవారం జరుపుకుంటారు.
అయితే రక్షా బంధన్ పండుగను ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం యమున మృత్యుదేవత అయిన యమరాజును తన అన్నగా భావిస్తుంది. యమరాజుకు దీర్ఘాయుష్షు ఇవ్వడానికి రక్షాదారాన్ని కడుతుంది.
దీంతో యమరాజు, యమునికి అమరత్వం అనే వరాన్ని ఇచ్చాడు. అప్పటి నుంచి ప్రతి శ్రావణ పూర్ణిమకు ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు.
Details
శ్రీ కృష్ణుడికి ద్రౌపది రాఖీ
ఇక శిశుపాలుడి పైకి శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన సమయంలో ఆయన చేతి వేలికి గాయమైంది.
ఇది గమనించిన ద్రౌపది, తన చీరకొంగులో ఒక చిన్న భాగాన్ని చింపి శ్రీ కృష్ణునికి కట్టిందట.
దీంతో కృష్ణుడు, ద్రౌపది అభిమానికి ముగ్ధుడై తన జీవితాంతం ద్రౌపదికి తోడు ఉంటానని మాట ఇచ్చారంట.
అందుకు ప్రతిగా దుశ్శాసనుడి నుండి ద్రౌపదిని కాపాడిన శ్రీకృష్ణుని ఈ వృత్తాంతం చరిత్రలో ప్రసిద్ధికెక్కింది.