LOADING...
Ditwa: దిత్వా తుపాను ప్రభావం.. రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాల హెచ్చరిక
దిత్వా తుపాను ప్రభావం.. రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాల హెచ్చరిక

Ditwa: దిత్వా తుపాను ప్రభావం.. రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాల హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 01, 2025
04:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి కొనసాగుతున్న దిత్వా తుపాను క్రమంగా బలహీనపడుతోందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. గత ఆరు గంటల్లో ఈ తుపాను గంటకు 5 కి.మీ వేగంతో నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతాల మీదుగా కదులుతోందని వివరించారు. ప్రస్తుతం దిత్వా తుపాను చెన్నైకి 50 కి.మీ, పుదుచ్చేరికి 130 కి.మీ, నెల్లూరుకు 200 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. రాబోయే 12 గంటల్లో ఇది వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. దిత్వా ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement