
Ram Navami 2025: శ్రీరామనవమి స్పెషల్ బెల్లం పానకం
ఈ వార్తాకథనం ఏంటి
మండుతున్న ఎండల్లో చల్లగా ఏదైనా తాగాలని అనిపిస్తుంటుంది. ఎలాగూ శ్రీరామ నవమి సమీపిస్తోందిగా, అప్పుడే మనం రాముని కళ్యాణానికి వడపప్పు, బెల్లం పానకం తయారు చేస్తుంటాం.
అదే విధంగా, ఇంట్లోనే ఈ పానకాన్ని సిద్ధం చేసుకుని ఉంచితే, దాహార్తి తీరటమే కాకుండా, రుచికరంగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఈ వేసవికి ప్రత్యేకమైన ఈ పానకం రెసిపీ మీ కోసం! ఇందులో ఉపయోగించే బెల్లం, యాలకులు, మిరియాలు, సబ్జా గింజలు ఇలా ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలే. మరి ఆలస్యం ఎందుకు? చల్లని పానకం రెడీ చేద్దాం!
వివరాలు
వేసవి ఉపశమనానికి బెల్లం పానకం
స్కూల్ పిల్లలు ఇంటికి రాగానే,లేదా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే వారికీ ఇలాంటి చల్లటి పానీయం అందిస్తే చాలు! ఒక్క క్షణంలోనే అలసట పోయి ఉల్లాసంగా ఫీలవుతారు.
బెల్లంతో కలిపిన చల్లటి నీరు దాహార్తిని తీర్చడమే కాకుండా,శరీరానికి తక్షణ శక్తినిస్తుంది.అల్లం,సబ్జా గింజలు శరీరాన్ని డిటాక్స్ చేయడంలో సహాయపడతాయి.
కావాల్సిన పదార్థాలు
బెల్లం - 350గ్రాములు
ఎండు అల్లం - 2 అంగుళాలు
నీరు - 3లీటర్లు
తులసి ఆకులు - కొన్ని
నిమ్మరసం - 3-4
వంట కర్పూరం చిటికెడు (కావాలంటే)
వివరాలు
తయారీ విధానం
ముందుగా, నాలుగు లీటర్ల చల్లటి నీరులో సన్నగా తురిమిన బెల్లం,ఎండు అల్లం,తులసి ఆకులు, నిమ్మరసం వేసి బాగా కలపాలి.
బెల్లం పూర్తిగా కరిగేలా కలిపి, తరువాత ఫ్రిజ్‌లో ఉంచితే చల్లగా ఉంటుంది.
ఇలా తయారు చేసుకున్న ఈ బెల్లం పానకం, వేడి వేసవిలో దాహార్తిని నివారించడంతో పాటు శరీరానికి శక్తినిస్తుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తూ, చల్లటి ఉపశమనాన్ని అందిస్తుంది.