Sankranti Muggulu: సంక్రాతి రోజు ముగ్గులు ఎందుకు వేస్తారో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
హిందువులు సంక్రాంతి పండుగను ఎంతో ఆహ్లాదంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు.
ఈ పండుగను "పెద్ద పండుగ" అని పిలుస్తారు. ఈ సందర్భంగా చాలా మంది దూర ప్రాంతాల నుంచి స్వగృహాలకు చేరుకుంటారు.
సంక్రాంతి పండుగలో అనేక రకాల పిండి వంటకాలు తయారు చేస్తారు. ఈ పండుగకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది.
సంక్రాంతి పండుగను నాలుగు రోజుల పాటు ఆనందభరితంగా జరుపుకుంటారు.
ఈ పండుగ సందర్భంగా ఇళ్ల ముందు అందమైన రంగుల ముగ్గులను వేస్తారు.
ఇప్పుడు ఈ ప్రక్రియ వెనుక ఉన్న ఉద్దేశ్యం, సంప్రదాయాలకు సంబంధించిన విషయాలు తెలుసుకుందాం.
వివరాలు
సంక్రాంతి నాడు ముగ్గుల ప్రాముఖ్యత
మన హిందూ సంప్రదాయంలో ముగ్గులకు విశేష ప్రాధాన్యత ఉంది. చారిత్రకంగా కూడా ముగ్గుల ప్రక్రియకు గొప్ప అనుబంధం ఉంది.
ఈ ముగ్గుల్లో తామర పువ్వు, నెమళ్లు, మామిడి పండ్లు, చేపలు వంటి చిహ్నాలు కనిపిస్తాయి.
ఈ చిహ్నాలు మనకు ప్రశాంతతను కలిగిస్తాయి. అంతేకాకుండా, దైవిక శక్తుల ఉనికిని మనం అనుభవిస్తాము.
ఇంట్లో లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి మరియు అతిధులను స్వాగతించడానికి ఇలాంటి ముగ్గులు వేస్తారు.
చెడు శక్తులను తొలగించి మంచి శక్తులు వస్తాయని భావించి తెల్లటి బియ్యం పిండితో ముగ్గులు వేస్తారు.
వివరాలు
లక్ష్మీదేవి అనుగ్రహం
సంక్రాంతి నాడు రంగురంగుల ముగ్గులు వేయడం వెనుక విశ్వాసం ప్రకారం, తెల్లవారుజామున లక్ష్మీదేవి ప్రతి వీధిలో ప్రవేశిస్తుంది.
ఎవరి ఇంటి ముందు శుభ్రంగా, అందమైన ముగ్గు ఉంటే ఆ ఇంటిలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని నమ్మకం.
లక్ష్మీదేవి ధనసమృద్ధి, ఆయురారోగ్యాలు, సుఖశాంతులు ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు.
ముగ్గుల వెనుక శాస్త్రీయ కారణాలు
ముగ్గులు వేసే ముందు గుమ్మం శుభ్రం చేయడం, పిండితో ముగ్గు వేయడం వల్ల క్రిమి కీటకాలు రాకుండా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
ముగ్గు వేస్తున్నప్పుడు వంగి లేవడం వల్ల శరీరానికి మంచి వ్యాయామం అవుతుంది, ఇది యోగాసనం లాంటి ప్రయోజనాలను కలిగిస్తుంది.
వివరాలు
భోగి, సంక్రాంతి ముగ్గులు
భోగి నాడు భోగి మంటల చుట్టూ ముగ్గులు వేస్తారు. చెరుకు గడలు, పొంగలి వంటి చిహ్నాలతో ముగ్గులు అలంకరిస్తారు. దీపాల ముగ్గులు కూడా అందంగా వేస్తారు.
కనుమ నాడు ముగ్గుల ప్రత్యేకత
కనుమ నాడు ప్రత్యేకంగా రథం ముగ్గులు వేయడం సంప్రదాయం. ఈ ముగ్గు చుట్టూ ఆకర్షణీయమైన బోర్డర్లు వేస్తారు.
మొత్తం పండుగకాలం మొత్తం ఇలాగే రంగురంగుల ముగ్గులతో ఇల్లు ముస్తాబై ఉంటాయి.
ఈ విధంగా సంక్రాంతి పండుగలో ముగ్గుల ప్రాముఖ్యత సాంప్రదాయాలను, ఆరోగ్యపరమైన ప్రయోజనాలను కలగజేస్తుంది.