రెసిపీ: దాల్ తడ్కాలో వెరైటీలు ఎలా తయారు చేయాలో తెలుసుకోండి
సాధారణంగా ఏదైనా దాబాలో భోజనం చేయాలనుకుంటే దాల్ తడ్కా ఆర్డర్ చేయడం చాలామందికి అలవాటు ఉంటుంది. తడ్కా అంటే పోపు అని అర్థం. పోపును పప్పులో కలపితే దాల్ తడ్కా తయారవుతుంది. తడ్కాలో చాలా వెరైటీలున్నాయి. అవేంటో చూద్దాం. నల్ల జీలకర్రతో తడ్కా: ఆవాల నూనెలో నల్ల జీలకర్ర వేసి బాగా వేయించాలి. ఇప్పుడు ఎండుమిర్చి, టమాట ముక్కలు వేయాలి. ఇప్పుడు ఎర్ర పప్పును ఉడికించి, తయారు చేసుకున్న పోపును పప్పులో వేయాలి. అంతే, హ్యాపీగా అన్నంతో ఆరగించండి. దాబా తడ్కా: జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, పసుపును నెయ్యిలో వేయించాలి. ఉల్లిగడ్డ, టమాట కలిపి వండాలి. గరం మసాలా, ధన్యాల పొడి, కొంత నీరు పోసి వండాలి.
చింతపులుపుతో అదిరిపోయే సాంబార్ తడ్కా
పోపును సిద్ధం చేసుకుని, ఉడికించిన కందిపప్పును పోపులో కలిపి వండితే దాబా తడ్కా తయారైనట్టే. జీలకర్ర-ఇంగువ తడ్కా: కందిపప్పు, పెసర పప్పుతో దీన్ని తయారు చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. ముందుగా పెనం మీద నెయ్యి వేసి, అందులో జీలకర్ర, ఇంగువ వేసి బాగా వేయించాలి. జీలకర్ర గింజలు విఛ్ఛిన్నం అవడం ప్రారంభించినపుడు వండిన పప్పులో ఈ పోపును కలపాలి. సాంబార్ తడ్కా: ఆవాలను నూనెలో వేయించి, ఎండుమిర్చి, కరివేపాకు, సాంబార్ మసాలా కలిపి బాగా వేయించాలి. చింతపండు రసంతో మిక్స్ చేసిన కందిపప్పుకు పోపును కలపాలి. అంతే సాంబార్ తడ్కా రెడీ అయిపోయినట్టే. దోస లేదా ఇడ్లీలు రెడీ చేసుకుని సాంబార్ తడ్కాతో ఆరగిస్తే మంచి రుచిగా ఉంటుంది.