
వర్షాకాలం ప్రభావం వల్ల మీ శరీరంలో, ఆలోచనల్లో వచ్చే మార్పులను ఇలా సరిచేసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
సాధారణంగా రుతువు మారినప్పుడు మనుషుల్లో మార్పులు వస్తుంటాయి. ఈ మార్పులు శారీరకంగానూ మానసికంగానూ ఉంటాయి.
వర్షాకాలంలో దిగులు ఎక్కువగా ఉంటుంది, అలాగే ఆత్రుత, అనవసర ఆందోళన, ఒత్తిడి, నీరసం లాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.
ఈ పరిస్థితి నుండి బయట పడడానికి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
వర్షాకాలంలో దిగులుగా అనిపించడానికి ముఖ్య కారణం సూర్యకాంతి ఎక్కువగా మన శరీరం పైన పడకపోవడమే.
అనవసర దిగులు నుంచి మీరు బయట పడాలంటే సూర్యకాంతిలో నిలబడాలి. నును వెచ్చని ఎండలో నిలుచున్నప్పుడు మనలో ఒక రకమైన ఉత్తేజం కలుగుతుంది.
దానివల్ల శరీరంలోని అలసత్వం తొలగిపోయి కొత్త రకమైన ఉత్తేజం వస్తుంది.
Details
వర్షాకాలంలో తేలికైన వ్యాయామం
సరైన ఆహారం:
శరీరం, మనసు సరిగ్గా స్పందించాలంటే సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. వర్షాకాలంలో తాజా కూరగాయలను, పండ్లను మాత్రమే తినాలి.
సాధారణంగా ఈ కాలంలో ఆహారం ఎక్కువగా కలుషితం అవుతుంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
కావాల్సినన్ని నీళ్లు:
వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాహం తక్కువగా అవుతుంది. ఈ కారణం వల్ల కూడా అనవసర దిగులు కలుగుతుంది. శరీరానికి కావలసినన్ని నీళ్లు ఖచ్చితంగా తాగడమే మంచిది.
వ్యాయామం:
బయట వర్షాలు పడుతున్నాయని నడక, ఎక్సర్సైజ్ మొదలైనవి చేయడం మానేస్తారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వ్యాయామం కచ్చితంగా అవసరం.
స్నేహితులు:
ఇంట్లో ఒంటరిగా కూర్చుంటే ఏవేవో ఆలోచనలు వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి కాబట్టి నలుగురితో కలవండి.