LOADING...
Rose Lassi Recipe: వేసవిలో కూల్ కూల్‌గా లస్సీ.. తాగారంటే మైమరచిపోావాల్సిందే
వేసవిలో కూల్ కూల్‌గా లస్సీ.. తాగారంటే మైమరచిపోావాల్సిందే

Rose Lassi Recipe: వేసవిలో కూల్ కూల్‌గా లస్సీ.. తాగారంటే మైమరచిపోావాల్సిందే

వ్రాసిన వారు Moogati Shabari
Apr 24, 2026
09:46 am

ఈ వార్తాకథనం ఏంటి

వేసవి కాలం వచ్చిందంటే చల్లని పానీయాలపై అందరికీ ప్రత్యేక ఆసక్తి పెరుగుతుంది. అలాంటి సమయంలో సాధారణ లస్సీకి బదులుగా రోజ్ లస్సీ తాగితే రుచి, సువాసన, చల్లదనం అన్నీ ఒకేసారి లభిస్తాయి. లేత గులాబీ రంగులో ఆకర్షణీయంగా కనిపించే ఈ డ్రింక్ చూడగానే తాగాలనిపిస్తుంది. ఒకసారి రుచి చూస్తే ఇంకో గ్లాస్ కోసం తప్పకుండా అడుగుతారు. రోజ్ లస్సీ కేవలం రుచికరమైన పానీయం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇందులో ఉండే గులాబీ సారం శరీరాన్ని చల్లబరచడంలో సహాయపడుతుంది. వేడి వల్ల కలిగే అసౌకర్యం, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. అలాగే పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అందుకే ఇది వేసవికి పర్ఫెక్ట్ డ్రింక్‌గా చెప్పొచ్చు.

వివరాలు

రోజ్ లస్సీకి కావలసిన పదార్థాలు ఇవే

తాజా చిక్కటి పెరుగు - 2 కప్పులు రోజ్ సిరప్ లేదా రూహ్ అఫ్జా - 3 నుండి 4 టేబుల్ స్పూన్లు పాల మీగడ - 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి - 1/4 టీస్పూన్ పిస్తా తురుము - 1 టేబుల్ స్పూన్ ఎండిన లేదా తాజా గులాబీ రేకులు చల్లటి నీరు లేదా పాలు - అర కప్పు ఐస్ క్యూబ్స్ - అవసరానికి సరిపడా

వివరాలు

తయారీ విధానం ఇదే..

ముందుగా బ్లెండర్ జార్ తీసుకుని అందులో పెరుగు, రోజ్ సిరప్, యాలకుల పొడి వేసుకోవాలి. తరువాత చల్లటి నీరు లేదా పాలు కలపాలి. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసి 1-2 నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేయాలి. మిశ్రమం చిక్కగా, నురుగు వచ్చేలా బాగా కలిపితే సరిపోతుంది. రోజ్ సిరప్‌లో ఇప్పటికే తీపి ఉంటుంది కాబట్టి ముందు రుచి చూసి అవసరమైతే మాత్రమే అదనంగా చక్కెర వేసుకోవాలి. తయారైన రోజ్ లస్సీని పొడవాటి గ్లాసుల్లో పోసి పైభాగంలో ఒక చెంచా క్రీమ్ వేయాలి. తరువాత పిస్తా తురుము, గులాబీ రేకులతో అందంగా అలంకరించి చల్లగా సర్వ్ చేయాలి. బయట దొరికే కోల్డ్ డ్రింక్స్‌కి బదులుగా ఇంట్లోనే ఇలా తయారు చేసుకుని ఆరోగ్యంగా ఆస్వాదించవచ్చు.

Advertisement