NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Saddula bathukamma 2024: సద్దుల బతుకమ్మ అంటే ఏమిటి? ఐదు రకాల నైవేద్యాలు ఏంటి?
    తదుపరి వార్తా కథనం
    Saddula bathukamma 2024: సద్దుల బతుకమ్మ అంటే ఏమిటి? ఐదు రకాల నైవేద్యాలు ఏంటి?
    సద్దుల బతుకమ్మ అంటే ఏమిటి? ఐదు రకాల నైవేద్యాలు ఏంటి?

    Saddula bathukamma 2024: సద్దుల బతుకమ్మ అంటే ఏమిటి? ఐదు రకాల నైవేద్యాలు ఏంటి?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 09, 2024
    01:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా జరుపుకునే పూల పండుగ బతుకమ్మ.

    ఈ ఏడాది అక్టోబర్ 2న ఎంగిలి పూల బతుకమ్మతో ఈ సంబరాలు ప్రారంభమయ్యాయి. దుర్గాష్టమి రోజు, అంటే అక్టోబర్ 11న సద్దుల బతుకమ్మతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.

    సద్దుల బతుకమ్మ విశిష్టత

    సద్దుల బతుకమ్మ అనేది అన్ని బతుకమ్మలకంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది.ఎనిమిది రోజులకు కొలువుగా,తొమ్మిదో రోజున తయారుచేసే బతుకమ్మ చాలా పెద్దది.

    ఇదే రోజు దుర్గాష్టమి పండుగను జరుపుకుంటారు.ఈ ఏడాది అష్టమి,నవమి ఒకే రోజున వస్తున్నాయి.

    సద్దుల బతుకమ్మ రోజున ఎన్ని రకాల పూలు దొరికితే,అన్ని రకాల పూలు అమర్చుకుని ఎత్తైన బతుకమ్మను తయారుచేస్తారు.

    వివరాలు 

    గునుగు పూలకు రంగులు

    అంతేకాక, పెద్ద బతుకమ్మతో పాటు చిన్న బతుకమ్మ కూడా ఏర్పాటు చేస్తారు. పసుపుతో గౌరీ దేవిని చేసి పూజ చేస్తారు. అమ్మవారిని పూజించిన తరువాత, మహిళలు ఒకరికొకరు పసుపు రాసుకుంటారు.

    తొమ్మిదో రోజు జరిగే సద్దుల బతుకమ్మను చూసేందుకు గ్రామస్థులందరూ ఒకచోట చేరుతారు.

    మహిళలు అందరూ ఉదయం నిద్రలేచి, ఇల్లంతా శుభ్రం చేసుకుని ప్రకృతిలో దొరికే పూలన్నింటిని తెచ్చుకుంటారు.

    తాంబూలం పళ్లెం తీసుకుని అందులో అన్ని రంగుల పూలను వరుసలుగా అమర్చుతారు.

    కొందరు వలయాకారంలో అమర్చిస్తే, మరికొందరు గోపురం, స్తూపం ఆకారంలో ఏర్పాటు చేస్తారు. గునుగు పూలకు రంగులు అద్ది వాటిని ఉపయోగిస్తారు.

    వివరాలు 

    ఐదు రకాల నైవేద్యాలు 

    ఒక్కొక్క వరుస పూలను అమర్చడం ద్వారా మధ్యలో ఆకులను వేస్తూ బతుకమ్మను తయారుచేస్తారు.

    తర్వాత, దాన్ని పూజ గదిలో పెట్టి ధూపం, దీపంతో పూజ చేస్తారు. సద్దుల బతుకమ్మ రోజున ఐదు రకాల నైవేద్యాలు పెడతారు.

    పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం, నిమ్మకాయ అన్నం అమ్మవారికి సమర్పిస్తారు.

    దీనితో పాటు చక్కెర, రొట్టె కలిపి చేసిన లడ్డూలు కూడా తయారుచేస్తారు.

    వివరాలు 

    బతుకమ్మ ఉత్సవం 

    సాయంత్రం సమయానికల్లా ఏ వీధి చూసినా బతుకమ్మలు కనువిందు చేస్తాయి.ప్రతి ఒక్కరూ తమకు కావలసిన బతుకమ్మలను తీసుకుని వస్తారు.

    వీటిని ఒక చోట పేర్చిచుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు.తొమ్మిది వరుసలుగా చేసే బతుకమ్మ చూసేందుకు అందరూ ఎంతో ఉత్సాహంగా ఉంటారు.

    బతుకమ్మలతో పాటు ఆడవాళ్ళు కూడా తామేమీ తక్కువ కాదంటూ పట్టు చీరలు కట్టి,ఆభరణాలు ధరించి మెరిసిపోతారు.

    ఆడవాళ్ళు తలల మీద బతుకమ్మలు పెట్టుకుని,ఊరి మధ్యలో లేదా చెరువు సమీపంలో తీసుకువెళ్లి పెట్టుతారు.వాటి చుట్టూ చేరి ఆటపాటలాడుతారు.

    చీకటి పడే వరకు అందరూ ఆనందంగా గడుపుతారు.అనంతరం,పోయి రావే బతుకమ్మ అంటూ, వెంట తీసుకువచ్చిన బతుకమ్మను గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేస్తారు.

    తర్వాత,వెంట తెచ్చుకున్న లడ్డూ నైవేద్యాలను ఒకరికొకరు పంచుకుంటారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బతుకమ్మ పండగ
    బతుకమ్మ

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    బతుకమ్మ పండగ

    బతుకమ్మ పండగ: 9 రోజుల బతుకమ్మ, 8రకాల నైవేద్యాల గురించి తెలుసుకోండి  లైఫ్-స్టైల్
    Engili pula bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ అంటే తెలుసా?.. దీనికి ఆ పేరు ఎలా వచ్చింది? ఎప్పుడు జరుపుకుంటారు? లైఫ్-స్టైల్
    Bathukamma: మొదలైన బతుకమ్మ పండుగ.. తొలి మూడ్రోజులు జరిగే సంప్రదాయాల గురించి తెలుసుకోండి దసరా
    Bathukamma: బతుకమ్మ పండుగ.. నాలుగు,ఐదు,ఆరు రోజున సమర్పించే పూలు ఏంటి.. వాటి ఔషధ గుణాలు గురించి తెలుసుకోండి లైఫ్-స్టైల్

    బతుకమ్మ

    Bathukamma Songs Lyrics: బతుకమ్మ టాప్ 5 పాటలు ఇవే.. ఆ పాటలకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్  బతుకమ్మ పండగ
    Bathukamma festivals: లండన్‌లో చేనేత బతుకమ్మ.. వైభవంగా దసరా ఉత్సవాలు లండన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025