Page Loader
Sankranti 2025 Recipes : సంక్రాంతి స్పెషల్.. అరిసెలు విరగకుండా టేస్టీగా రావాలంటే ఈ రెసిపీ ఫాలో అవ్వండి
సంక్రాంతి స్పెషల్.. అరిసెలు విరగకుండా టేస్టీగా రావాలంటే ఈ రెసిపీ ఫాలో అవ్వండి

Sankranti 2025 Recipes : సంక్రాంతి స్పెషల్.. అరిసెలు విరగకుండా టేస్టీగా రావాలంటే ఈ రెసిపీ ఫాలో అవ్వండి

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 08, 2025
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

సంక్రాంతి పండుగ అంటే ప్రతి ఇంట్లో అరిసెలు తయారు చేసుకోవడం సహజం. పల్లెటూర్లకు పట్టణాల నుంచి అతిథులు చేరుకోవడంతో, పండుగకు ప్రత్యేకమైన కొత్త దుస్తులు, కొత్త రుచులు సిద్ధమవుతాయి. వంటింట్లో అరిసెలు, సున్నుండలు, పాకుండలు, జంతికలు, గారెలు, బూరెలు ఇలా ఎన్నో రుచికరమైన వంటకాలు తయారవుతాయి. ఈ పండుగకు అరిసెలు అనేది ఖచ్చితంగా తినాల్సిన ముఖ్యమైన వంటకం. అయితే, అరిసెలు పర్ఫెక్ట్ గా చేయడం చాలా కష్టమైన విషయం. అరిసెలు మరీ మందంగా, గట్టిగా వస్తే తినలేరు. అరిసెలు మెత్తగా, టేస్టీగా ఉండాలంటే, ఆ పదార్థాలను ఎలా కలిపి, సరైన పద్ధతిలో వండాలో తెలుసుకోండి.

వివరాలు 

అరిసెలు రెసిపీకి కావలసిన పదార్థాలు: 

బియ్యం - 1.5 కిలో, బెల్లం - 1 కిలో, నెయ్యి లేదా నూనె - 500 గ్రాములు, గసగసాలు - 1 స్పూను, నువ్వులు - 1 స్పూను అరిసెలు తయారీ విధానం: మొదట, బియ్యాన్ని రాత్రి కడిగి,మంచినీటితో నానబెట్టాలి. ఉదయం వరకు నానబెట్టిన బియ్యాన్ని నీరులో ఒంపి, తడిగా ఉన్నప్పుడు దంచాలి. ఈ బియ్యాన్ని మిల్లులో ఆడించి, పిండిని తీసుకోవాలి. పిండిని జల్లెడతో జల్లించి ఒక గిన్నెలో ఉంచాలి. బెల్లాన్ని చిన్నగా తురిమి, పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు, ఒక పెద్ద గిన్నెలో బెల్లం, నీరు వేసి పాకం రాగలిగేలా మరగనివ్వాలి. పాకం వచ్చిన తర్వాత, బియ్యప్పిండిని వేసి బాగా కలిపి,గట్టిగా అయ్యేవరకు కలుపుతూ ఉండాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి.

వివరాలు 

అరిసెలు రెసిపీకి కావలసిన పదార్థాలు: 

దీనిని గోరువెచ్చగా వదిలేయాలి. ఇప్పుడు, స్టవ్ మీద మరో పాన్ పెట్టి, నెయ్యి లేదా నూనె వేసి, అరిసెలు డీప్ ఫ్రై చేయడానికి తగినంత నూనె వేయాలి. పాకం పిండిని తీసుకుని, చేత్తో లడ్డూలా చుట్టి, చిన్న పూరీలాగా ఒత్తుకుని పైన గసగసాలు మరియు కొంచెం నువ్వులు చల్లుకోవాలి. అలా అన్ని పూరీలు చేయగానే, వేడెక్కిన నూనెలో వేసి రెండు వైపులా కాల్చాలి. ఆ తర్వాత, వాటిని టిష్యూ పేపర్ మీద పెడితే నూనెను టిష్యూ పేపర్ పీల్చేస్తుంది. ఈ అరిసెలు గాలి చేరని కంటైనర్‌లో దాచిపెట్టి రెండు మూడు వారాల వరకు ఫ్రెష్‌గా రుచిచూడవచ్చు.

వివరాలు 

అరిసెలు మెత్తగా రావాలనుకుంటే

బెల్లం పాకం మరీ మందంగా కాకుండా, లేతగా ఉన్నప్పుడు బియ్యప్పిండిని వేయాలి. అప్పుడు అరిసెలు మెత్తగా మరియు రుచిగా వస్తాయి. పాకం ఎక్కువ ముదరిపోయినప్పుడు, అరిసెలు గట్టిగా మారిపోతాయి. ఈ పద్ధతిలో అరిసెలు చేసుకుని చూడండి, అది మీకు తప్పకుండా నచ్చుతాయి. ఈ అరిసెలు ఎంతో రుచిగా ఉంటాయి, అలాగే నిల్వ ఉంచినా తాజాగా ఉంటాయి.