Page Loader
Sankranti: సంక్రాంతి స్పెషల్.. పాలతో తయారయ్యే ప్రత్యేక తీపి వంటకాలు 
సంక్రాంతి స్పెషల్.. పాలతో తయారయ్యే ప్రత్యేక తీపి వంటకాలు

Sankranti: సంక్రాంతి స్పెషల్.. పాలతో తయారయ్యే ప్రత్యేక తీపి వంటకాలు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 11, 2025
06:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా అని పాడుకునే సమయం వచ్చేసింది. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు ముందుగానే మొదలయ్యాయి. సంక్రాంతి పండుగకు ప్రత్యేకంగా పిండి వంటలు, తీపి పదార్థాలు చేసుకుంటాం. వీటిలో కొత్తగా ఏదైనా వెరైటీ ప్రయత్నించాలని అనుకునే వారికి పాలతో తయారయ్యే ఈ ప్రత్యేకమైన రెసిపీలను చూడండి. ఆపిల్ పాలు వింటే కొత్తగా అనిపించినా, ఈ రెసిపీ తయారు చేయడం చాలా సులభం. ఒక పాత్రలో పాలు తీసుకుని అవి సగం అయ్యే వరకు మరిగించాలి. అందులో కొంత చక్కెర వేసి తక్కువ మంటపై ఉంచాలి. ఈ సమయంలో రెండు ఆపిల్స్‌ తరిగి, మరుగుతున్న పాలలో వేసి 5 నిమిషాలు ఉంచాలి. చివరగా ఏలకులు, పిస్తా, బాదం చేర్చాలి.

Details

పాలతో తయారయ్యే మరిన్ని తీపి వంటకాలు

పాల పోహ 1.కొన్ని అటుకులను నీళ్లలో కొద్దిసేపు నానబెట్టాలి. 2. ఆ తరువాత వాటిని వడబోసి నీటిని వంచి పక్కన పెట్టుకోవాలి. 3. మరో పాత్రలో పాలు, బిర్యానీ ఆకు, ఏలకులను మరిగించాలి. తరువాత, తడిగా ఉన్న అటుకులను పాలల్లో వేసి కొన్ని నిమిషాలు ఉంచాలి. బెల్లం లేదా చక్కెర వేసి కలపాలి. చివరగా డ్రై ఫ్రూట్స్‌ వేసి సర్వ్‌ చేయండి.

Details

పాయసం

1. మరుగుతున్న పాలలో కొంచెం బియ్యం పిండిని వేసి మిశ్రమం ముద్దలుగా కాకుండా కలుపుతూ ఉండాలి. 2. తీపి కోసం కావాల్సినంత చక్కెర వేసి మరిగించాలి. 3. మిశ్రమం గట్టిపడిన తర్వాత స్టవ్‌ మీద నుంచి దించి, ఏలకులను నలగ గొట్టి ఆ మిశ్రమం మీద జల్లాలి. తర్వాత అందరికీ వేడి వేడి పాయసం వడ్డించండి.