Sankranti: సంక్రాంతి సంప్రదాయాలు, ఆచారాలు, వాటి ప్రాముఖ్యత
ఈ వార్తాకథనం ఏంటి
సూర్యుడు మకరరాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి పండగగా పరిగణిస్తారు.
మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథున రాశులలో ఈ కాలం ఉంటుంది. తర్వాత దక్షిణాయణం ప్రారంభమై మిగతా రాశుల్లో కొనసాగుతుంది.
ఉత్తరాయణం సమయంలో పగలు ఎక్కువగా ఉంటాయి. అదే దక్షిణాయణంలో రాత్రి ఎక్కువగా ఉంటుంది.
పురాణాలు ప్రకారం, ఉత్తరాయణం పూర్తయ్యే సమయంలో దేవతలకు ఒక పగలు ముగియడంతో, దక్షిణాయణం పూర్తయితే ఒక రాత్రి అవుతుందని చెబుతాయి.
ఈ కాలంలో మొదటి పండగ సంక్రాంతి. ఈ రోజు ఆడపిల్లలు తెల్లవారు జామున నిద్రలేచి, వాకిట్లో ముగ్గులు వేస్తారు. అలాగే పాలు పొంగించి, వాటితో మిఠాయిలు తయారుచేస్తారు.
Details
గాలి పటాలు ఎగరవేయడానికి కారణమిదే
సంక్రాంతి రోజున ఇంటింటి వంటల్లో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, చక్కినాలు, పాలతాలికలు, సేమియా పాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు తదితర వంటకాలు చేస్తారు.
సంక్రాంతి రోజున పితృతర్పణలు చేయడం కూడా చాలా ముఖ్యమైన పద్ధతి.
సాధారణంగా ఒక సంవత్సరంలో 12 సంక్రాంతులు ఉంటాయి. కానీ మకర సంక్రాంతికి మాత్రమే పితృతర్పణలు తప్పకుండా చేస్తారు.
గంగిరెద్దులు పండగ సందర్భంలో చక్కగా అలంకరించి ఇంటింటి తిరుగుతూ, డోలు, సన్నాయి వాయిస్తూ నృత్యాలు చేస్తారు.
ఈ రోజు గాలిపటాలు ఎగరవేస్తారు, దీనికి కూడా మంచి కారణం ఉంది. గాలిపటాలు ఎగరవేయడం ద్వారా సూర్యుని ఎండ మనమీద పడుతుంది.
తద్వారా విటమిన్ డి శరీరంలో చేరుతుంది, ఇది ఎముకలను బలంగా చేస్తుంది.