NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / ఒంటరిగా జీవిస్తున్నారా? డబ్బుల్ని సేవ్ చేసుకునే పద్దతులు తెలుసుకోండి 
    తదుపరి వార్తా కథనం
    ఒంటరిగా జీవిస్తున్నారా? డబ్బుల్ని సేవ్ చేసుకునే పద్దతులు తెలుసుకోండి 
    ఒంటరిగా జీవిస్తున్నవారు డబ్బుల్ని ఇలా సేవ్ చేసుకోండి

    ఒంటరిగా జీవిస్తున్నారా? డబ్బుల్ని సేవ్ చేసుకునే పద్దతులు తెలుసుకోండి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 18, 2023
    06:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒంటరిగా జీవించడం చాలా కష్టం. తోడు లేకుండా కాలం గడపడం అంత ఈజీ కాదు. ఈ మధ్యకాలంలో చాలామంది సోలో లైఫ్ వైపు మొగ్గు చూపుతున్నారు.

    ఒంటరిగా జీవించే వారికి ఖర్చు చాలా తక్కువగా ఉంటుందనుకుంటే పొరపాటే అవుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు తెలియకుండానే చాలా ఖర్చులు అవుతుంటాయి.

    ప్రస్తుతం ఖర్చుల్ని తక్కువ చేసి డబ్బులు ఎలా పొదుపు చేయాలో తెలుసుకుందాం.

    పార్సిల్స్ తెచ్చుకోవడం మానేయండి:

    ఒంటరిగా ఉన్నప్పుడు వండుకోవడం బద్ధకం అవుతుంది. రెగ్యులర్ గా బయటనుంచి పార్సెల్ తెచ్చుకోవడం అలవాటుగా ఉంటుంది. ఈ అలవాటును పూర్తిగా మానేకపోయినా కొంతవరకు తగ్గించండి.

    దీని వల్ల చాలా డబ్బు ఆదా అవుతుంది. వండుకోవడం అలవాటు చేసుకోండి. వంట వండేటప్పుడు కలిగే ఆనందాన్ని ఫీల్ అవ్వండి.

    Details

    ఖర్చు తగ్గించడానికి షేరింగ్ తప్పనిసరి 

    సబ్ స్క్రిప్షన్స్ తగ్గించుకోండి:

    స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫార్మ్స్ ఇంకా ఇతర క్లబ్ మెంబర్షిప్స్ మొదలైన వాటి సబ్ స్క్రిప్షన్ తగ్గించుకోండి. కొన్నిసార్లు రెగ్యులర్గా ఎలాంటి క్లబ్ కి వెళ్లకపోయినా మెంబర్షిప్ తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాటిని పూర్తిగా మానేయండి.

    షేర్ చేసుకోండి:

    మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ లేదా దగ్గరి బంధువులతో మీ ఖర్చులను షేర్ చేసుకోండి. ఆఫీసుకు ఇద్దరూ ఒకే బైక్ మీద వెళ్ళటం లాంటివి చేయడం వల్ల మీకు ఖర్చు చాలా తగ్గుతుంది. అంతేకాదు ఈ మధ్య ఫ్రెండ్షిప్ కూడా పెరుగుతుంది.

    Details

    సెకండ్ హ్యాండ్ వస్తువులను కొనుక్కోండి

    ఫ్రిడ్జ్, సోఫా, వాషింగ్ మిషన్ మొదలగు వాటిని సెకండ్ హ్యాండ్ లో తీసుకోవడం వల్ల ఖర్చు చాలా తగ్గుతుంది. ఆన్ లైన్ లో సెకండ్ హ్యాండ్ వస్తువులు చాలా దొరుకుతాయి.

    పాత వాటిని కొనుక్కోవడం వల్ల మీకు డబ్బులు మిగలడమే కాకుండా చాలా తక్కువ ధరకే వస్తువులు లభిస్తాయి.

    సింపుల్ గా జీవించండి:

    ఒంటరిగా బతకాలనుకున్నవారు ఎవరినీ ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అనవసర డాబుకు పోయి డబ్బులను వృధా ఖర్చు చేయకపోవడమే మంచిది.

    సింపుల్ గా జీవితాన్ని గడపడం వల్ల డబ్బు ఎక్కువగా మిగులుతుంది. ఆ డబ్బుతో మీకున్న అభిరుచుల మీద లక్ష్యాల మీద ఖర్చు పెట్టవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జీవితం
    డబ్బు

    తాజా

    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    #NewsBytesExplainer: అంతరిక్షం నుండి కనిపించే ఏకైక మానవ నిర్మాణం ... ఎక్కడ ఉందంటే..? అంతరిక్షం

    జీవితం

    ప్రేరణ: టాలెంట్ ఉండి కృషి చేయలేని వాడు, టాలెంట్ లేని కృషి చేసే వాడి చేతిలో ఓడిపోతాడు  ప్రేరణ
    ప్రేరణ: నీ ప్రయాణం ఎంత నెమ్మదిగా ఉన్న ఫర్వాలేదు కానీ ఆగిపోకూడదు  ప్రేరణ
    ప్రేరణ: నీ జీవితానికి నువ్వు ఓనర్ లా ఉండాలి, మేనేజర్ లా కాదు  ప్రేరణ
    ప్రేరణ: ఏదైనా పని ముఖ్యమైనదని నువ్వు అనుకుంటే, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా పని పూర్తి చేయాలి  ప్రేరణ

    డబ్బు

    మ్యూఛువల్ ఫండ్స్: సిప్ లో తొందరగా ఇన్వెస్ట్ ఎందుకు చేయాలో తెలుసుకోండి లైఫ్-స్టైల్
    మీ స్నేహితులకు అప్పు ఇచ్చారా? వసూలు చేయడం ఇబ్బందిగా ఉందా? ఇలా చేయండి బంధం
    డబ్బు గురించి పిల్లల్లో ఏ విధంగా అవగాహన కల్పించాలో తెలుసుకోండి పిల్లల పెంపకం
    డబ్బును అర్థం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ఆశ మీకుంటే ఈ పుస్తకాలు చదవండి  ఫైనాన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025