NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / ప్రపంచంలోనే  రుచికరమైన టాప-5 కర్రీస్ ఇవే 
    తదుపరి వార్తా కథనం
    ప్రపంచంలోనే  రుచికరమైన టాప-5 కర్రీస్ ఇవే 
    ప్రపంచవ్యాప్తంగా నోరూరించే వంటకాలు ఇవే

    ప్రపంచంలోనే  రుచికరమైన టాప-5 కర్రీస్ ఇవే 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 02, 2023
    04:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచవ్యాప్తంగా నోరూరించే వంటకాలు, ఘుమఘుమలాడే రుచికరమైన కూరలు తయారు కావాలంటే సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు పడాల్సిందే.

    ఒక్కో ప్రదేశంలో ఒక్కో కర్రీ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన కర్రీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

    1. పనాంగ్ కూర - ఇది ఆసియాలోని థాయ్ ప్రత్యేక వంటకం. రుచికరమైన థాయ్ కర్రీకి 1890నాటి నుంచే గొప్ప చరిత్ర ఉంది. మృదువైన ఎరుపు రంగులో నోరూరించే ఈ వంటకాన్ని పనాంగ్ కర్రీ అని కూడా అంటారు.

    పనాంగ్ కూర, "ఫనాంగ్" అని పిలిచే ఈ కూర, వగరు రుచికి ప్రత్యేకం. వేరుశెనగ ద్వారా దీన్ని తయారు చేస్తారు. తీపి, పులుపుల కలబోతగా సమతుల్యతతో కూడిన రుచిని ఇది అందిస్తుంది.

    details

    శాకాహార రుచుల్లో మలై కోఫ్తా ఫేమస్

    2. టేస్టీ మలై కోఫ్తా

    దేశంలో అత్యంత ఎక్కువగా ఇష్టపడే శాకాహార రుచుల్లో ఇదొకటి. సువాసనగల సాస్‌లో వేయించిన పన్నీర్ బాల్స్ తో దీన్ని తయారు చేస్తారు.మలాయ్ మొఘలాయ్ వంటకాలకు చెందినవిగా ప్రసిద్ధి.

    సిల్కీ-స్మూత్, తేలికపాటి కారంతో, మృదువుగా ఉండే పన్నీర్ కర్రీని తందూరి బ్రెడ్,నాన్, జీరా రైస్‌తో సర్వ్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు.

    3. ఇండియన్ షాహీ పనీర్

    ప్రపంచవ్యాప్తంగా షాహీ పన్నీర్ ప్రత్యేకతను సంతరించుకుంది.దీని పేరు షాహి పన్నీర్. అంటే రాయల్ పన్నీర్ అని అర్ధం. పనీర్ ప్రధాన పదార్ధంగా, విరిగిపోయిన పాల ఉత్పత్తులతో తయారవుతుంది.

    కుంకుమపువ్వు, గరం మసాలా వంటి సువాసనగల మసాలాలతో పాటు జీడిపప్పు వేసి తయారు చేస్తారు. భోజనప్రియులు షాహీ పన్నీర్ ను చాలా ఇష్టపడుతుంటారు.

    details

    దక్షిణ భారతం స్పెషల్ సాంబార్ 

    4. కట్సు కూర -జపనీస్ స్పెషల్

    బ్రెడ్, వేయించిన కట్‌లెట్‌లతో దీన్ని తయారు చేసే కట్సు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి జపాన్‌లో చాలా క్రేజ్ ఉంటుంది. అక్కడ దీన్ని ఎక్కువగా లాగిస్తారు.

    వెల్వెట్ కర్రీ సాస్ వివిధ సుగంధ ద్రవ్యాలు, కూరగాయలతో కలిపి దీన్ని తయారు చేస్తారు.ఎక్కువగా ఆపిల్‌లను కలపడంతో తీపి రుచినీ అందిస్తుంది.ఈ కట్లెట్ తింటే ప్రోటీన్ల పరంగా ఢోకా ఉండదు.

    5. సాంబార్

    దక్షిణ భారతదేశంలో సాంబార్ అంటే తెలియనివారు ఉండరు. రకరకాల కూరగాయలు, పప్పు, చింతపండు ఆధారంగా పులుసుతో చేసే ప్రసిద్ధమైన వంటకం ఇది.

    తమిళనాడు నుంచే ఉద్భవించినప్పటికీ, దక్షిణాది మొత్తానికే ఈ సాంబార్ వంటకం ఫేమస్. శ్రీలంకలోనూ గొప్ప ఆదరణ పొందింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వంటగది
    ఆహారం

    తాజా

    Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. సీఎం సిద్ధరామయ్య పొలిటికల్‌ సెక్రటరీపై వేటు బెంగళూరు
    Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. నిఫ్టీ @25,000  స్టాక్ మార్కెట్
    Modi in J&K: 'కశ్మీర్‌లో పర్యాటకాన్ని దెబ్బతీయాలని పాక్‌ కుట్రలు' : నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ
    Piyush Chawla : 36 ఏళ్ల వ‌య‌సులో.. రిటైర్‌మెంట్ ప్రకటించిన భార‌త క్రికెట‌ర్‌  క్రికెట్

    వంటగది

    కిచెన్: రాగి ముద్ద నుండి రాగిదోశ వరకు రాగులతో తయారయ్యే వంటకాల రెసిపీస్ బరువు తగ్గడం
    సంక్రాంతి సంబరం: పాలతో తయారయ్యే నోరూరించే తీపి పదార్థాలు, మీకోసమే సంక్రాంతి
    ఆహారానికి మరింత రుచిని అందించే జామ్ లని ఇంట్లోనే తయారు చేసుకోండి లైఫ్-స్టైల్
    మీకు వడ అంటే ఇష్టమా? ఈ వెరైటీలను ఒకసారి ట్రై చేయండి లైఫ్-స్టైల్

    ఆహారం

    జీర్ణశక్తిని పెంచడం నుండి బరువు తగ్గించడం వరకు జీలకర్ర వల్ల కలిగే ప్రయోజనాలు  ఆరోగ్యకరమైన ఆహారం
    ఫుడ్ కాంబినేషన్స్: ఏ రెండు ఆహారాలను కలిపి తినకూడదో ఇక్కడ తెలుసుకోండి  ఆరోగ్యకరమైన ఆహారం
    వర్షాకాలంలో మీ ఆరోగ్యం బాగుండాలంటే ఎలాంటి ఆహారాలను తినకూడదో తెలుసుకోండి  వర్షాకాలం
    నేషనల్ జంక్ ఫుడ్ డే: జంక్ ఫుడ్ తినే అలవాటును మానేందుకు ప్రేరణ కలిగించే పుస్తకాలు  ముఖ్యమైన తేదీలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025