Page Loader
Black Salt: తెల్ల ఉప్పుకి చెక్ చెప్పండి.. బ్లాక్ సాల్ట్‌తో ఆరోగ్య ప్రయోజనాలు దక్కించుకోండి!
తెల్ల ఉప్పుకి చెక్ చెప్పండి.. బ్లాక్ సాల్ట్‌తో ఆరోగ్య ప్రయోజనాలు దక్కించుకోండి!

Black Salt: తెల్ల ఉప్పుకి చెక్ చెప్పండి.. బ్లాక్ సాల్ట్‌తో ఆరోగ్య ప్రయోజనాలు దక్కించుకోండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 05, 2025
01:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్లాక్ సాల్ట్‌ (కాళా న‌మ‌క్‌) అనేది దక్షిణాసియాలోని అనేక ప్రాంతాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఉప్పు రకం. ముఖ్యంగా చాట్స్‌, సలాడ్స్‌, శాకాహార వంటకాల్లో దీనిని విరివిగా వాడుతుంటారు. ఆయుర్వేద పద్ధతుల ప్రకారం చూస్తే, బ్లాక్ సాల్ట్‌ వంటిలోకి చేరినప్పుడు ఔషధ గుణాలు కలిగినట్టే. ఇది జీర్ణత నుంచి హై బీపీ వరకు అనేక ఆరోగ్య సమస్యలకు సహాయపడుతుంది.

Details

జీర్ణశక్తి పెరుగుతుంది

బ్లాక్ సాల్ట్‌లో ఆల్కలైన్ లక్షణాలు, సల్ఫర్ సమ్మేళనాలు ఉండటంతో జీర్ణాశయంలోని అగ్ని బలపడుతుంది. ఇది అసిడిటీ, అజీర్తి, పొట్ట ఉబ్బరం, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. లివర్‌లో పైత్య ఉత్పత్తిని సమతుల్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా కొవ్వులో కరిగే విటమిన్లను శరీరం మెరుగ్గా గ్రహించేలా చేస్తుంది. మలబద్ధకం తగ్గుతుంది బ్లాక్ సాల్ట్‌లో సహజ లాక్సేటివ్ గుణాలు ఉండటంతో పేగుల కదలికలు మెరుగుపడి, మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. నిమ్మకాయ నీళ్లు, మజ్జిగ, సలాడ్‌ల్లో కలిపి సులభంగా తీసుకోవచ్చు.

Deails

బీపీ ఉన్నవారికి బ్లెస్‌

హైబీపీ ఉన్నవారు సాధారణ ఉప్పును తగ్గించుకోవాలని చెబుతుంటారు. బ్లాక్ సాల్ట్‌లో సోడియం శాతం తక్కువగా ఉండటంతో, ఇది హైబీపీ ఉన్నవారికి ఉత్తమ ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. అయితే, దీనిని కూడా పరిమితంగా తీసుకోవాలి. సాధారణ ఉప్పుతో పోలిస్తే, బ్లాక్ సాల్ట్‌లో ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇది పోషకాహార లోపం ఉన్నవారికి మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

Details

కండరాల ఆరోగ్యానికి ఉపకారం 

బ్లాక్ సాల్ట్‌లో ఉండే పొటాషియం, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను సమంగా ఉంచి కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. రాత్రిళ్ళు కాలికి పట్టే సమస్యలు నివారించడంలో సాయపడుతుంది. యాంటీ-ఇన్‌ఫ్లామేటరీ గుణాల వల్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. చర్మం & జుట్టుకూ మేలు బ్లాక్ సాల్ట్‌ను ఫేస్ ప్యాక్ రూపంలో ఉపయోగించవచ్చు. ఇది చర్మంపై మృతకణాలను తొలగించి, చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. యవ్వనంగా కనిపించేలా సహాయపడుతుంది. అలాగే జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలను కూడా తగ్గించే శక్తి దీనిలో ఉంది. బ్లాక్ సాల్ట్‌ను సాధారణంగా వాడే తెల్ల ఉప్పు స్థానంలో ఆహారంలో భాగంగా చేసుకుంటే, దాని ద్వారా వీటన్నింటికీ పరిష్కారంగా నిలుస్తుంది.