Seema Chintakaya: ఇవి తింటే.. డయాబెటిస్‌తో పాటూ ఆ రోగాలన్నీ దూరం
ఇప్పటి పిల్లలకు సీమ చింతకాయాలు అంటే లేయకపోవచ్చు. ఇప్పటి పెద్దవారికి సీమ చింతకాయలు నోస్టాల్జియా అని చెప్పుకోవాలి. గ్రామాలలో పెరిగిన వారికి సీమ చింతకాయలు సుపరిచితమైనవి. కానీ, నగరాల్లో ఇవి దొరకడం చాలా అరుదు. ఈ చింతకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెప్పుకోవచ్చు. వీటిని "గుబ్బ కాయలు"గా కూడా పిలుస్తారు, అలాగే "జంగిల్ జిలేబి" అనే పేరుతో కూడా ప్రసిద్ధి చెందాయి. మధ్యాహ్నం లేదా రాత్రి భోజనానంతరం తీపి తినాలని అనిపించినప్పుడు,సీమ చింతకాయలు తీసుకోవడం మంచిది. ఇవి ఆరోగ్యానికి అమృతంతో సమానం. ఆయుర్వేదంలో జంగిల్ జిలేబిని ఔషధంగా ఉపయోగిస్తారు. ఇంగ్లీష్‌లో దీన్ని"మద్రాస్ థార్న్"అంటారు, అలాగే సాధారణంగా"విలాయతి చింతపండు","గంగా జిలేబి","తీపి చింతపండు" అనే పేర్లతో పిలుస్తారు.
పోషకాలు
తెలుగువారు వీటిని "సీమ చింతకాయలు" లేదా "గుబ్బ కాయలు" అని అంటారు. సీమ చింతకాయలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. వీటిలో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్స్, విటమిన్ సి, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ కాయలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. రుచి: సీమ చింతకాయల పుట్టినిల్లు మెక్సికోగా భావిస్తారు. ఈ పండు పండిన తర్వాత ఎరుపు రంగులోకి మారుతుంది. ఇది తీపి, ఆస్ట్రిజెంట్ రుచిని కలిగి ఉంటుంది. ఇది నోట్లో వేసుకున్న వెంటనే కరిగిపోతుంది.
డయాబెటిస్ ఉన్నవారికి
సీమ చింతకాయలు డయాబెటిస్ రోగులకు ఎంతో ప్రయోజనకరమైనవి. జంగిల్ జిలేబి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి.ఇవి మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. సీమ చింతకాయలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడతాయి, తద్వారా గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
రోగనిరోధక శక్తి
సీమ చింతకాయలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. వీటిలో పుష్కలంగా ఉన్న విటమిన్ సి శరీరానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది, ఇవి వ్యాధులతో పోరాడటంలో సహాయపడతాయి. సీమ చింతకాయలు క్రమం తప్పకుండా తింటే జీర్ణశక్తి మెరుగవుతుంది, అలాగే అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. వృద్ధి ఈ చెట్లు పట్టణాల్లో కనిపించడం చాలా అరుదు, కానీ గ్రామాల్లో ఇంకా ఉన్నాయి. వీటిని అధికంగా అడవుల్లోనూ, గ్రామ శివారులలో ఈ చెట్లు కనిపిస్తూ ఉంటాయి.