LOADING...
Sesame Laddu: అనీమియాకు సహజ పరిష్కారం: నువ్వుల లడ్డూ వల్ల అద్భుత ప్రయోజనాలు
అనీమియాకు సహజ పరిష్కారం: నువ్వుల లడ్డూ వల్ల అద్భుత ప్రయోజనాలు

Sesame Laddu: అనీమియాకు సహజ పరిష్కారం: నువ్వుల లడ్డూ వల్ల అద్భుత ప్రయోజనాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 09, 2026
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ రోజుల్లో సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల అనేక మంది రక్తహీనత (అనీమియా) సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. శరీరంలో రక్తం తగ్గిపోతే నీరసం, త్వరగా అలసిపోవడం, శక్తి తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ సమస్యను తగ్గించడానికి మన వంటింట్లోనే దొరికే కొన్ని సాధారణ పదార్థాలు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి వాటిలో ముఖ్యమైనది నువ్వుల లడ్డూ. దీన్ని ప్రతిరోజూ తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు లభించి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

తయారి  పదార్థాలు

నువ్వుల లడ్డూ తయారికి అవసరమైన పదార్థాలు

నువ్వుల లడ్డూ తయారు చేయడానికి చాలా సులభమైన పదార్థాలే అవసరం. ఒక కప్పు నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు తీసుకోవచ్చు. అయితే ఆరోగ్య పరంగా నల్ల నువ్వులు ఎక్కువ ప్రయోజనాలు కలిగిస్తాయని భావిస్తారు. అదనంగా ముప్పావు కప్పు బెల్లం తురుము, కొద్దిగా యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అవసరం అవుతుంది. ఈ పదార్థాలతో సులభంగా రుచికరమైన లడ్డూలను తయారు చేయవచ్చు.

వివరాలు 

తయారీ విధానం

మొదట స్టవ్‌పై ఒక పాన్ పెట్టి చిన్న మంటపై నువ్వులను దోరగా వేయించాలి. అవి చిటపటలాడే వరకు వేయించి, మాడిపోకుండా జాగ్రత్తగా తీసేయాలి. తర్వాత వాటిని ఒక ప్లేట్‌లో వేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత నువ్వులను మిక్సీ జార్‌లో వేసి కొద్దిగా పొడి ముద్దలా అయ్యేలా గ్రైండ్ చేయాలి. తరువాత అదే జార్‌లో బెల్లం తురుము, యాలకుల పొడి వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని అవసరమైతే కొద్దిగా నెయ్యి వేసి బాగా కలపాలి. చివరగా చేతులతో చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకోవాలి.

Advertisement

వివరాలు 

నువ్వుల లడ్డూ వల్ల కలిగే ప్రయోజనాలు

నువ్వులు, బెల్లం రెండింటిలోనూ ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. దీంతో శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరిగి రక్తహీనత సమస్య తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉన్న కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది. ముఖ్యంగా మహిళల్లో పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. అలసటగా ఉన్నప్పుడు ఒక నువ్వుల లడ్డూ తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. అదనంగా నువ్వుల్లోని పోషకాలు చర్మానికి కాంతి ఇచ్చి,జుట్టు రాలడాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. కాబట్టి ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఒక నువ్వుల లడ్డూను క్రమం తప్పకుండా తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా గర్భిణీలు,చిన్నపిల్లలు,పాలిచ్చే తల్లులు దీన్ని తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. దీంతో రక్తహీనత సమస్యను సహజంగా తగ్గించుకోవచ్చు.

Advertisement