Karthika Masam: కార్తీక మాసంలో నదీ స్నానం.. ఆధ్యాత్మిక,శాస్త్రీయ,ఆరోగ్య ప్రయోజనాలు
ఈ వార్తాకథనం ఏంటి
పురాణాల ప్రకారం,కార్తీక మాసం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది.ఈ నెలలో చేసే నదీ స్నానం,ప్రతీ పూజ,దానం వంటి ఆచారాలు ప్రత్యేక ఫలితాలు ఇస్తాయని చెప్పబడింది. ఈ స్నానం కేవలం ఆధ్యాత్మికానికి మాత్రమే కాకుండా,శరీర ఆరోగ్యం కోసం కూడా ఎంతో ఉపయోగకరమని పండితులు సూచిస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కార్తీక మాసం శివ,కేశవ భక్తులకు అత్యంత ప్రియమైనది. పురాణాల ప్రకారం,ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు నదులు,చెరువులలో విహరిస్తాడని నమ్మకం ఉంది. అందుకే,కార్తీకమాసంలో నదీ స్నానం చేయడం ద్వారా భక్తి పరమైన ఆధ్యాత్మిక అనుగ్రహం పొందుతుందని నమ్ముతారు. ఈ మాసంలో నదీ స్నానం,దీపారాధన,కార్తీక పురాణం పఠనం వంటి ఆచారాలు మోక్ష సాధనకు మార్గాన్ని సృష్టిస్తాయని పండితులు చెబుతున్నారు. స్నానం చేసేటప్పుడు నీటిలో దైవ శక్తిని ఆహ్వానించడం అవసరం.
వివరాలు
స్నానం చేసేటప్పుడు చదవాల్సిన మంత్రం
"గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు" అనే మంత్రాన్ని పఠించడం ద్వారా.. స్నానం చేసే నీటిలో సకల నదుల పవిత్రతను ఆవాహన చేస్తారు. శాస్త్రీయ, ఆరోగ్య ప్రయోజనాలు కార్తీక మాసంలో నదీ స్నానం ఒక మతపరమైన ఆచారమే కాక,ఆరోగ్యానికి కూడా ఉపయుక్తం. ప్రకృతిసిద్ధంగా,ఈ మాసం ప్రారంభమైనప్పుడు చలి పెరుగుతుంది.చలివలన చర్మ సమస్యలు రావచ్చు. కార్తీకం ప్రారంభమయ్యే నాటికి వర్షాకాలం ముగిసి, నదులలోని వరదనీరు తగ్గి, నీరు స్వచ్ఛంగా మారుతుంది. నది ప్రవాహంలో రాళ్లు,వృక్షాలు తాకడం వల్ల నీటిలో సహజంగా ఖనిజాలు, మూలికల గుణాలు కలుస్తాయి. పండితుల మాటల ప్రకారం, రాత్రంతా చంద్రకిరణాల ప్రభావంలో ఉన్న నదీ జలాలు మరింత ఔషధ శక్తి కలిగి ఉంటాయి.
వివరాలు
జ్యోతిష్య సంబంధిత ప్రయోజనాలు
ఈ నీటిలో స్నానం చేయడం వలన శరీరం రుగ్మతల నుంచి రక్షించబడుతుంది. చలి కారణంగా కార్తీకంలో ఉదయం వేళ నదీ స్నానం చేయడం శారీరక చురుకుదనం పెంచుతుంది. రక్తప్రసరణ మెరుగై, రోజంతా శక్తివంతంగా, ఉత్సాహంగా ఉండడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణశక్తినీ పెంపొందిస్తుంది. కార్తీక మాసంలో చంద్రుడు శక్తివంతంగా ఉంటుంది. దీని ప్రభావం నీటిపై, మనసుపై ఎక్కువగా ఉంటుంది. చంద్రకిరణాలతో కూడిన నీటిలో స్నానం చేయడం మానసిక ప్రశాంతతను ఇస్తుంది.
వివరాలు
ప్రత్యామ్నాయ మార్గం
నదీ స్నానం సాధ్యం కాని పరిస్థితుల్లో, ఇంట్లో స్నానం చేసే నీటిలో పై మంత్రాన్ని పఠించి నదీజలాలను ఆహ్వానించి స్నానం చేయవచ్చు. మొత్తంగా, కార్తీకమాసపు నదీ స్నానం శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శుద్ధికి ఒక అద్భుతమైన మార్గం. తెల్లవారుజామున నదీ ప్రవాహంలో స్నానం చేసి, సూర్యోదయానికి ముందే శివారాధన చేస్తే, గత జన్మల పాపాలు తొలగి, అపారమైన పుణ్య ఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.