Page Loader
Vitamin C: విటమిన్ సి లోపం ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే..?
విటమిన్ సి లోపం ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే..?

Vitamin C: విటమిన్ సి లోపం ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే..?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2025
10:39 am

ఈ వార్తాకథనం ఏంటి

విటమిన్ C మన శరీరంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మనకు సులభంగా అందుబాటులో ఉంటుంది. విటమిన్ C లోపం అనేది చాలా మందికి ఎదురయ్యే సమస్య. అందువల్ల, రోజూ విటమిన్ Cని మన ఆహారంలో చేర్చుకోవడం చాలా అవసరం. లేకపోతే, విటమిన్ C లోపం అనేది ఆరోగ్య సంబంధిత సమస్యలు తెచ్చి పెట్టవచ్చు. ఈ లోపాన్ని గుర్తించడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి.

వివరాలు 

ఆరోగ్య సమస్యలు పట్ల సహజంగా స్పందించడం 

విటమిన్ C లోపం ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు సులభంగా వస్తాయి. విటమిన్ C ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. ఇది ఆక్సీడేటివ్ స్ట్రెస్, సంక్రమణల నుండి మన శరీరాన్ని రక్షిస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ గాయాలను త్వరగా మరమ్మతు చేసి.. కొల్లాజెన్ పెరుగుదల కొరకు సహాయపడతాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. పండ్లు, కూరగాయలు విటమిన్ Cతో నిండి ఉంటాయి. అందువల్ల, ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా మన శరీరానికి కావలసిన విటమిన్ C అందుతుంది.

వివరాలు 

విటమిన్ C లోపం కారణంగా ఏర్పడే సమస్యలు 

కీళ్ల,కండరాల నొప్పులు విటమిన్ C లోపం వలన కీళ్లు, కండరాల నొప్పులు ఎక్కువగా ఏర్పడతాయి. దీనితో పాటు రక్తహీనత కూడా వచ్చి, రక్తంలో ఐరన్ అర్బ్జోర్ తక్కువగా జరుగుతుంది. ఇది ఎర్ర రక్త కణాల సంఖ్యను తగ్గిస్తుంది, అందువల్ల మనం నిరుత్సాహంగా, అలసిపోయినట్లుగా కనిపిస్తాము. కొంతమంది బరువు తగ్గడం కూడా జరగవచ్చు. ఏ పనులు చేయకుండానే నొప్పులు ఎక్కువగా వస్తే, ఇది విటమిన్ C లోపంగా సూచించవచ్చు. నీరసం ఊరికే అలసిపోయిన, నీరసంగా ఉన్న, అది విటమిన్ C లోపానికి సూచన కావచ్చు. మన ఆహారంలో సరిపడా విటమిన్ C లేకపోతే, మనం ఏదైనా పనిని చేయడానికి కూడా శక్తి లేకుండా ఉండిపోతాం. ఈ పరిస్థితిలో, డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.

వివరాలు 

గాయాలు వేగంగా తగ్గకపోవడం 

విటమిన్ C లేకపోతే,సర్జరీలు,గాయాలు లేదా పుండ్ల కారణంగా గాయాలు వేగంగా తగ్గవు. అయితే, విటమిన్ C సప్లిమెంట్స్ తీసుకునే వారికి గాయాలు త్వరగా నయం అవుతాయి.ఇది కోలాజెన్ ప్రోటీన్‌‌కు సహాయం చేస్తుంది,దానివల్ల చర్మం మృదువుగా,సాఫ్ట్‌గా ఉండటానికి సహాయం చేస్తుంది. సరిపడా విటమిన్ C లేకపోతే,మనం వయస్సులో పెద్దవారిలా కనిపించవచ్చు.కాబట్టి,మంచి చర్మం కావాలంటే,విటమిన్ C అధికంగా ఉన్న పండ్లు,ఫుడ్స్ తీసుకోవాలి. చర్మ సంబంధిత సమస్యలు చర్మంలో విటమిన్ C లెవల్స్ తగ్గితే,చర్మం ఎర్రబడడం,రాషెస్ రావడం,నోటి చుట్టూ లేదా పెదవుల పై భాగంలో చర్మం డ్రై అవడం జరుగుతుంది. ఇది కూడా విటమిన్ C లోపం సంకేతంగా ఉండవచ్చు. ఈ విటమిన్ రక్త సరఫరా మెరుగ్గా ఉండటానికి సహాయం చేస్తుంది,తద్వారా గాయాలు త్వరగా చికిత్స పొందుతాయి.

వివరాలు 

జుట్టు రాలడం 

విటమిన్ C లోపం ఉన్నప్పుడు, జుట్టు త్వరగా రాలటం, పొడిబారటం, పెలుసు అవడం, నిర్జీవంగా మారటం మొదలైన సమస్యలు ఏర్పడతాయి. జుట్టు బలహీనమయ్యి ,రాలిపోతుంది. రెగ్యులర్‌గా జుట్టు పడుతున్నప్పుడు,విటమిన్ C లోపం ఉందని మీరు అనుమానించవచ్చు. చిగుళ్ల సమస్యలు, వాపులు, రక్తస్రావం వంటి ఇతర సమస్యలు కూడా వస్తాయి. అంతేకాక, దంతాలకు సంబంధించిన సమస్యలు కూడా ఏర్పడతాయి, దాంతో దంతాలు వదులుగా మారడం లేదా ఊడిపోవడం జరుగుతుంది. ఈ అన్ని లక్షణాలను గమనించి, విటమిన్ C సరిపడా తీసుకుంటే, ఈ సమస్యలు తగ్గించుకోవచ్చు.