
మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచే కూలింగ్ ఫేస్ ప్యాక్స్
ఈ వార్తాకథనం ఏంటి
రోజంతా పనిచేసి అలసిపోయిన తర్వాత చర్మానికి కూలింగ్ ఫేస్ ప్యాక్ వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. దీనివల్ల చర్మం పాడవకుండా ఆరోగ్యంగా ఉంటుంది.
అయితే ప్రస్తుతం ఇంట్లో తయారు చేసుకోగలిగే కూలింగ్ ప్యాక్స్ గురించి తెలుసుకుందాం.
పెరుగు, కలబంద:
టేబుల్ స్పూన్ కలబంద, పెరుగు తీసుకుని బాగా మిక్స్ చేసి ముఖానికి మాస్క్ లాగా తగిలించుకోవాలి. 15నిమిషాల తర్వాత ముఖం కడుక్కుంటే సరిపోతుంది.
కలబంద కారణంగా చర్మం మృదువుగా మారుతుంది. పెరుగులో ఉండే లాక్టికామ్లం వల్ల ముఖం మీద చనిపోయిన చర్మ కణాలు తొలగిపోయి అందంగా మారుతుంది.
గ్రీన్ టీ, పుదీనా:
గ్రీన్ టీ తయారు చేసి చల్లారిన తర్వాత పుదీనా రెబ్బల్ని నలిపేసి ముఖానికి మాస్క్ లాగా పెట్టుకుని 15నిమిషాల తర్వాత కడిగేయాలి.
Details
చర్మాన్ని తేమగా ఉంచే పుచ్చకాయలోని పోషకాలు
దోసకాయ, నిమ్మరసం:
మీడియం సైజు దోసకాయను తీసుకుని గింజలను తీసేసి రసం తయారు చేసుకోవాలి. ఆ తర్వాత నిమ్మరసం తయారు చేసి దోసకాయ రసానికి మిస్క్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని ఎండిపోయిన తర్వాత కడిగితే సరిపోతుంది.
పుచ్చకాయ, తేనె:
వాటర్ మెలన్ ముక్కలను నలిపేసి, వాటికి తేనె కలిపి ముఖం, మెడ భాగాలకు 2-3నిమిషాల పాటు మర్దన చేయాలి. కాసేపయ్యాక చల్లని నీటితో ముఖాన్ని కడుక్కుంటే మంచిది. వీటిలోని పోషకాలు చర్మాన్ని తేమగా ఉంచుతాయి.
పసుపు, రోజ్ వాటర్:
రోజ్ వాటర్ లో పుదీనా కలిపి గ్రైండ్ చేయాలి. ఈ పేస్టులో కొద్దిగా పసుపు కలిపి ముఖానికి మాస్క్ లాగా తగిలించుకుని 10నిమిషాలయ్యాక కడిగితే చాలు.