విటిలిగో: చర్మంపై తెల్లటి మచ్చలు ఏర్పడే పరిస్థితిపై జనాల్లో ఉన్న అపోహాలు
ఈ వార్తాకథనం ఏంటి
చర్మంపై తెల్లటి మచ్చలు ఏర్పడటాన్ని విటిలిగో అంటారు. ఇది ఆటో ఇమ్యూన్ సమస్య.
అంటే, చర్మం రంగును సాధారణంగా ఉంచే మెలనో సైట్స్ ని, మీ రోగనిరోధక వ్యవస్థ దాడి చేస్తుంది. దానివల్ల చర్మం మీద అక్కడక్కడా తెల్లటి మచ్చలు(విటిలిగో) ఏర్పడతాయి.
విటిలిగో పరిస్థితిపై జనాల్లో అనేక అపోహాలున్నాయి. అవేంటో చూద్దాం.
డైట్ సరిగ్గా లేకపోతే విటిలిగో వస్తుంది:
చాలామంది ఆహారం సరిగ్గా తినకపోతే విటీలిగో వస్తుందని అనుకుంటారు. చేపలు తిన్న వెంటనే పాలు తాగితే విటిలిగో వస్తుందని చెబుతారు. కానీ ఇది అబద్ధమని పరిశోధనల్లో తేలింది.
జన్యుపరమైన సమస్యలు, పర్యావరణంలో మార్పుల వల్ల విటిలిగో వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
Details
ట్రీట్మెంట్ లేని విటిలిగో వ్యాధి
విటిలిగో అనేది అంటువ్యాధి:
ఒకరి నుండి ఒకరికి ఈ వ్యాధి సోకదు. విటిలిగో వ్యక్తులతో స్నేహంగా ఉన్నా, ఒకే దగ్గర భోజనం చేసినా, శృంగారంలో పాల్గొన్నా, విటిలిగో అంటుకునే వ్యాధి కాదు.
విటిలిగోకు ట్రీట్ మెంట్ ఉంది:
ఇది కొంత శాతం నిజమే అయినప్పటికీ ఎక్కువ శాతం నిజం కాదు. విటిలిగోను పూర్తిగా తగ్గించడం సాధ్యం కాదు. మెడిసిన్స్, ట్రీట్ మెంట్ ద్వారా విటిలిగో వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉంది.
అంతేకానీ చర్మంపై తెల్లమచ్చలను సాధారణ రంగులోకి మార్చడం సాధ్యం కాదు.
ఎండవల్ల విటిలిగో వస్తుంది:
ఇది పచ్చి అబద్ధం. సూర్యకాంతి వల్ల విటిలిగో ఏర్పడదు. ముందే చెప్పినట్టు జన్యుపరమైన కారణాలు, పర్యావరణంలోని కారకాలే కారణమవుతాయి.