కాంబినేషన్ రకం చర్మం గలవారు ఎలాంటి చర్మ సంరక్షణ పద్దతులు పాటించాలో తెలుసుకోండి
కాంబినేషన్ రకం: జిడ్డుదనం పొడిదనం కలగలిసిన చర్మ రకాన్ని కాంబినేషన్ రకం అంటారు. ఈ రకం చర్మం గల వారిలో ముఖ రంధ్రాలు, మొటిమలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అంతేకాదు, పొళుసులుగా చర్మం రాలిపోవడం, ఎర్రగా మారడం, మృదుత్వాన్ని కోల్పోవడం జరుగుతుంటుంది. ఇలాంటి చర్మం గలవారు చర్మ సాధనాలు ఎంచుకోవడంలో, వాటిని వాడటంలో అవగాహన పెంచుకోవాలి. ప్రస్తుతం కాంబినేషన్ రకం చర్మం గల వారు ఎలాంటి చర్మ సంరక్షణ పద్దతులు ఫాలో కావాలో చూద్దాం. క్లీన్ అండ్ టోన్: జెల్ మాదిరిగా ఉండే క్లీన్సర్ ఉపయోగించడం వల్ల పొడిబారిన చర్మం తేమగా మారుతుంది. అలాగే జిడ్డుదనం పోతుంది. ఆల్కహాల్ లేని టోనర్ వాడితే చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తుంది.
ఎక్స్ ట్రా ఆయిల్ ని దూరం చేసే బ్లాటింగ్ పేపర్
మాయిశ్చరైజ్: చర్మం మీద ఏర్పడిన పొళుసులు దూరం కావాలంటే గ్లైకోలిక్ ఆసిడ్ ఆధారిత స్క్రబ్ ని వాడాలి. దీనివల్ల చనిపోయిన చర్మకణాలు తొలగిపోతాయి. ఆ తర్వాత నీళ్ళు కలిగిన మాయిశ్చరైజర్ ని వాడితే చర్మం తేమగా ఉంటుంది. బ్లాటింగ్ పేపర్, సన్ స్క్రీన్: మీ చర్మం జిడ్డుగా ఉంటే బ్లాటింగ్ పేపర్స్ ని వెంట ఉంచుకోండి. ఈ పేపర్స్ కారణంగా చర్మం పైన పేరుకున్న ఆయిల్ తొలగిపోతుంది. అలాగే సన్ స్క్రీన్ కారణంగా చర్మం పాడవదు. ఫేస్ మాస్క్, ఐ సీరమ్: వారానికి ఒకసారి ఫేస్ మాస్క్ పెట్టుకుంటే చర్మం మీది ఎక్స్ ట్రా ఆయిల్ తొలగిపోతుంది. దీనివల్ల మొటిమలు ఏర్పడవు. కళ్ళకింద వలయాలు ఏర్పడకుండా ఉండాలంటే ఐ సీరమ్ వాడండి.