చర్మ సంరక్షణ: చర్మంపై నల్లమచ్చలు ఏర్పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చలికాలంలో చర్మ సంరక్షణ చాలా అవసరం. రుతువు మారినప్పుడు చర్మం ప్రభావితం అవుతుంది. చర్మ సమస్యల్లో నల్లమచ్చలు ప్రధాన సమస్య. దీన్ని పట్టించుకోకపోతే చర్మం రంగు మారిపోయే అవకాశం ఉంటుంది. మీ చర్మం రంగు మారకుండా ఉండడానికి ఏమేం చేయాలో ఏమేం చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం. సన్ స్క్రీన్: సూర్యకిరణాలు చర్మం మీద పడడం వల్ల అందులోని అతినీల లోహిత కిరణాలు చర్మం రంగును ప్రభావితం చేస్తాయి. అందుకే ఇంట్లో నుండి బయటకు వెళ్తే ఖచ్చితంగా సన్ స్క్రీన్ వాడండి. ఇంట్లోనే ఉంటూ ల్యాప్ టాప్ మీద పనిచేసే వారు కూడా సన్ స్క్రీన్ వాడటం ఉత్తమం. ఎలక్ట్రానిక్ తెరల నుండి వచ్చే నీలికాంతి చర్మం మీద ప్రభావం చూపకుండా ఇది కాపాడుతుంది.
సొంత ప్రయోగాలు వద్దు
తేమగా ఉంచడం: చర్మాన్ని ఎల్లప్పుడూ తేమగా ఉంచితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మీ చర్మ రకానికి ఏది నప్పుతుందో అలంటి మాయిశ్చరైజర్లు వాడాలి. అలాగే ఫ్యాటీ ఆమ్లాలు ఉండే ఆహారాన్ని మీ డైట్ లో చేర్చుకోండి. సొంత ప్రయోగాలు వద్దు: మీ చర్మం మీద నల్లమచ్చలు ఏర్పడితే వాటిమీద సొంతవైద్యం ప్రయోగించవద్దు. ఖచ్చితంగా వైద్యుల సలహా తీసుకోండి. ప్రతీసారీ గూగుల్ సరిగ్గా చెబుతుందని నమ్మలేం. రుద్దడం మానుకోండి. చర్మం మీద మచ్చలు ఏర్పడి చర్మం రంగు మారుతుంటే గట్టిగా రుద్దితే బాగవుతుందని అనుకోవద్దు. అలా చేయడం వల్ల చర్మానికి హాని కలుగుతుంది. నల్లమచ్చలు అనేవి చర్మ రంగు నల్లగా ఉన్నవారిలో కనిపిస్తాయి. మెలనిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళే ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు.