వర్షాకాలంలో చర్మ సంరక్షణ కోసం పాటించాల్సిన టిప్స్ తెలుసుకోండి
ఏ ఋతువులో అయినా చర్మాన్ని సంరక్షించుకోవడం ఖచ్చితంగా అవసరం. ఋతువు మారే సమయంలో చర్మం మీద ప్రభావం ఉంటుంది. అందుకే చర్మ సంరక్షణ పద్దతులు పాటించాలి. వర్షాకాలంలో వాతావరణంలో తేమ శాతం పెరిగిపోతుంది కాబట్టి చర్మానికి అనేక ఇబ్బందులు వస్తాయి. అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ చూద్దాం. సన్ స్క్రీన్ మర్చిపోవద్దు: వర్షాకాలం ఎండలు ఉండవు కదా అని సన్ స్క్రీన్ పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఎండలు లేకపోయినా సూర్య కిరణాలు మీ చర్మాన్ని పాడుచేస్తాయి. సో, సన్ స్క్రీన్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. అది కూడా బయట వెళ్ళాలనుకునే 20నిమిషాల ముందు పెట్టుకుంటే మంచిది. ఈ కాలంలో జెల్ టైప్ సన్ స్క్రీన్ బాగుంటుంది.
ఆల్కహాల్ లేని టోనర్ చేసే మేలు
మృత కణాలను తొలగించాలి: చనిపోయిన చర్మ కణాలను తొలగించేందుకు చర్మాన్ని రుద్దాలి. దీనికోసం మార్కెట్ లో ప్రోడక్ట్స్ ఉంటాయి. మృత కణాలు తొలగిపోతే చర్మం మరింత అందంగా కనిపిస్తుంది. క్లీన్ చేయాలి: చర్మాన్ని రోజూ క్లీన్ చేయాలి. అయితే రోజుకు రెండు కంటే ఎక్కువ సార్లు క్లీన్ చేస్తే చర్మం పొడిబారిపోతుందని గుర్తుంచుకోండి. టోనర్ వాడండి: గాలిలో తేమ పెరగడం వల్ల మీ చర్మం జిగటగా, గ్రీజ్ పట్టినట్టుగా అనిపిస్తుంది. దానికోసం ఆల్కహాల్ లేని టోనర్ ని వాడితే బాగుంటుంది. మాయిశ్చరైజ్: గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది కదా మాయిశ్చరైజ్ చేయడం ఎందుకులే అనుకుంటారు. కానీ మాయిశ్చరైజ్ చేయడం వల్ల ముడుతలు ఏర్పడవు.